Mimu doora nobanu mimchadanim baaya lenu

మిము దూర నోపను మించతనిఁ బాయ లేను
Language

(॥పల్లవి॥)
మిము దూర నోపను మించతనిఁ బాయ లేను
తమకము దైన్యముఁ దడఁబడెనూ

(॥మిము॥)
ఆల విభునియెలుఁగు ఆలించెద నిదె
పలుకకురే అటు పలుమారు
యెలమి నాతనికి నెదు రేఁగెద నిదె
పిలువకురే ననుఁ బెనఁగుచును

(॥మిము॥)
వడి నతని నగరివంక చూచెదను
యెడ నడ్డము రా కిటు దలరే
తొడ రతనిసతులతో మాఁట లాడెద
చిడుముడిఁ బరాకు సేయకురే

(॥మిము॥)
శ్రీవెంకటపతికిఁ జేతుల మొక్కెద
చేపల బుద్దులు చెప్పకురే
కావించి నన్నతుఁడు కాఁగిటఁ గూడెను
భావించి ననుఁ బై పై నవ్వకురే

(||pallavi||)
mimu dūra nobanu miṁchadanim̐ bāya lenu
tamagamu dainyamum̐ daḍam̐baḍĕnū

(||mimu||)
āla vibhuniyĕlum̐gu āliṁchĕda nidĕ
palugagure aḍu palumāru
yĕlami nādanigi nĕdu rem̐gĕda nidĕ
piluvagure nanum̐ bĕnam̐gusunu

(||mimu||)
vaḍi nadani nagarivaṁka sūsĕdanu
yĕḍa naḍḍamu rā kiḍu dalare
tŏḍa radanisadulado mām̐ṭa lāḍĕda
siḍumuḍim̐ barāgu seyagure

(||mimu||)
śhrīvĕṁkaḍabadigim̐ jedula mŏkkĕda
sebala buddulu sĕppagure
kāviṁchi nannadum̐ḍu kām̐giḍam̐ gūḍĕnu
bhāviṁchi nanum̐ bai pai navvagure