మిమ్మే యలుగనిచ్చు మీవలపులు
(॥పల్లవి॥)
మిమ్మే యలుగనిచ్చు మీవలపులు
చిమ్మరేఁగ రట్టు పెట్టి చెనకించుగాక
(॥॥)
వొట్టులు వెట్టుకొంటిరి వొకరొక రిందాఁకా
అట్టె యింతలో నొక్కటైతిరా మీరు
దిట్టవై కాఁతాళించి దీకొంటి రప్పటిని
గుట్టుతోడ లోలోనే కూడుకొంటిరా
(॥॥)
తగవుచెప్పుమంటిరి తరుణుల నింతవడి
మెగమోడి మీరుమీరే మొక్కుకొంటిరా
బిగియుచుఁ గొంతవడి పెనఁగుకొంటా నుంటిరి
జిగిఁగూడి బాసలెల్లాఁ జేసుకొంటిరా
(॥॥)
వెక్కసాన మంచాలపై వేరేవుంటి రింతవడి
చొక్కపుమీ మొగములు చూచుకొంటిరా
పక్కన మీరిద్దరూను బలిమిఁ బై కొంటిరి
చక్కని శ్రీ వేంకటేశ జాణలైతిరా
(||pallavi||)
mimme yaluganichchu mīvalabulu
simmarem̐ga raṭṭu pĕṭṭi sĕnagiṁchugāga
(||||)
vŏṭṭulu vĕṭṭugŏṁṭiri vŏgarŏga riṁdām̐kā
aṭṭĕ yiṁtalo nŏkkaḍaidirā mīru
diṭṭavai kām̐tāḽiṁchi dīgŏṁṭi rappaḍini
guṭṭudoḍa lolone kūḍugŏṁṭirā
(||||)
tagavusĕppumaṁṭiri taruṇula niṁtavaḍi
mĕgamoḍi mīrumīre mŏkkugŏṁṭirā
bigiyusum̐ gŏṁtavaḍi pĕnam̐gugŏṁṭā nuṁṭiri
jigim̐gūḍi bāsalĕllām̐ jesugŏṁṭirā
(||||)
vĕkkasāna maṁchālabai verevuṁṭi riṁtavaḍi
sŏkkabumī mŏgamulu sūsugŏṁṭirā
pakkana mīriddarūnu balimim̐ bai kŏṁṭiri
sakkani śhrī veṁkaḍeśha jāṇalaidirā