Mimchu sannalum jaayalu meege kaaga

మించు సన్నలుఁ జాయలు మీకే కాక
Language

(॥పల్లవి॥)
మించు సన్నలుఁ జాయలు మీకే కాక
పంచల నేమెల్లా నేరుపరచఁగ వచ్చునా

(॥మించు॥)
బెట్టాతఁడు పిలువఁగఁ బెదవినే నవ్వేవు
యెట్టివో మీమందెమేళా లెవ్వఁ డెరుఁగు
పట్టె నదివో కొంగు పరాకయ్యే వంతలో
మట్టులేనిమతకాలు మాకు దిద్దవసమా

(॥మించు॥)
చెక్కులాతఁడు నొక్కఁగ సిగ్గులువడేవు నీవు
యిక్కువ మీమర్మములు యెవ్వఁ డెరుఁగు
కక్కసించి కొసరఁగ ఘాతల జంకించేవు
పిక్కటిల్లుమీసుద్దులు పేరుకొనఁగలమా

(॥మించు॥)
శ్రీవేంకటేశుఁ డాతఁడు శ్రీసతి విన్నిటా నీవు
యీవల మీమహిమలు యెవ్వఁ డెరుఁగు
కావిరిఁ గూడె నతఁడు కైకొని చెలఁగితివి
వేవేలు మే మెరిఁగినవి వివరించఁ దగునా

(||pallavi||)
miṁchu sannalum̐ jāyalu mīge kāga
paṁchala nemĕllā nerubarasam̐ga vachchunā

(||miṁchu||)
bĕṭṭādam̐ḍu piluvam̐gam̐ bĕdavine navvevu
yĕṭṭivo mīmaṁdĕmeḽā lĕvvam̐ ḍĕrum̐gu
paṭṭĕ nadivo kŏṁgu parāgayye vaṁtalo
maṭṭulenimadagālu māgu diddavasamā

(||miṁchu||)
sĕkkulādam̐ḍu nŏkkam̐ga sigguluvaḍevu nīvu
yikkuva mīmarmamulu yĕvvam̐ ḍĕrum̐gu
kakkasiṁchi kŏsaram̐ga ghādala jaṁkiṁchevu
pikkaḍillumīsuddulu perugŏnam̐galamā

(||miṁchu||)
śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍu śhrīsadi vinniḍā nīvu
yīvala mīmahimalu yĕvvam̐ ḍĕrum̐gu
kāvirim̐ gūḍĕ nadam̐ḍu kaigŏni sĕlam̐gidivi
vevelu me mĕrim̐ginavi vivariṁcham̐ dagunā