మించి యెప్పుడును నేము మీవారమే
(॥పల్లవి॥)
మించి యెప్పుడును నేము మీవారమే
కంచపుపొత్తు గలసి కసిగాటులేఁటికే
(॥॥)
చిక్కని వెన్నెలతేట చిందీ సెలవులను
చెక్కుమీఁది చేయేల చెలియ నీకు
మొక్కళపుఁ దమ్మిదలు మూఁగీఁ గన్నులతుద
ముక్కునఁ గోపములేలే ముట్టినంతలోననే
(॥॥)
పూఁపలుఁ బిందెలు నట్టెపొడమెఁ బయ్యదలోన
కై పుసేసీ నీనడుమఁ గరసేఁటికే
పైపైఁ బదారువన్నెపసిఁడిపొడి రాలీని
కోపపుగుంపెనలేలే కొంగు వట్టితేను
(॥॥)
నిలువు నూరుఁ బండీని నిచ్చలు నీసింగారాలు
తలకొన సిగ్గులలో దాఁగేవేలే
యెలమితో శ్రీ వేంకటేశుఁడ కూడితి నిన్ను-
నలివేణి మఱుపేలే ఆయ మంటితేను
(||pallavi||)
miṁchi yĕppuḍunu nemu mīvārame
kaṁchabubŏttu galasi kasigāḍulem̐ṭige
(||||)
sikkani vĕnnĕladeḍa siṁdī sĕlavulanu
sĕkkumīm̐di seyela sĕliya nīgu
mŏkkaḽabum̐ dammidalu mūm̐gīm̐ gannuladuda
mukkunam̐ gobamulele muṭṭinaṁtalonane
(||||)
pūm̐palum̐ biṁdĕlu naṭṭĕbŏḍamĕm̐ bayyadalona
kai pusesī nīnaḍumam̐ garasem̐ṭige
paibaim̐ badāruvannĕbasim̐ḍibŏḍi rālīni
kobabuguṁpĕnalele kŏṁgu vaṭṭidenu
(||||)
niluvu nūrum̐ baṁḍīni nichchalu nīsiṁgārālu
talagŏna siggulalo dām̐gevele
yĕlamido śhrī veṁkaḍeśhum̐ḍa kūḍidi ninnu-
naliveṇi maṟubele āya maṁṭidenu