Mimchi neeve sedugaaga meemdamikkili panulu

మించి నీవే సేతుగాక మీఁదమిక్కిలి పనులు
Language

(॥పల్లవి॥)
మించి నీవే సేతుగాక మీఁదమిక్కిలి పనులు
పంచనే మొదల నెట్టు పైకొనేరా

(॥మించి॥)
గక్కనఁ జూచినంతనే కళదాఁకె నా తోడ
మక్కళించి యిఁక నెట్టు మాటలాడేరా
మిక్కుటమై పులకించె మెరసి నీవు రాఁగానే
యిక్కువ లెరిఁగి నిన్ను నెటు గాఁగిలించేరా

(॥మించి॥)
దవ్వుల నీవు నవ్వితే తనువెల్లాఁ జెమరించె
రవ్వగా నీతో నెట్టు రతినేసేరా
అవ్వల సన్న సేసితే నంతలోనే భ్రమసితి
చివ్వన నీచెఱుఁ గెట్టు చేతఁ బట్టేరా

(॥మించి॥)
తతితో వీడె మిచ్చితే తలకెక్కె వలపెల్లా
యితవై నీమోవి యానే దిఁక నెంతరా
అతివేడుక శ్రీవేంకటాద్రీశ కూడీతివి
మతిలోఁ జొక్కుటగాక మరి యేమనేరా

(||pallavi||)
miṁchi nīve sedugāga mīm̐damikkili panulu
paṁchane mŏdala nĕṭṭu paigŏnerā

(||miṁchi||)
gakkanam̐ jūsinaṁtane kaḽadām̐kĕ nā toḍa
makkaḽiṁchi yim̐ka nĕṭṭu māḍalāḍerā
mikkuḍamai pulagiṁchĕ mĕrasi nīvu rām̐gāne
yikkuva lĕrim̐gi ninnu nĕḍu gām̐giliṁcherā

(||miṁchi||)
davvula nīvu navvide tanuvĕllām̐ jĕmariṁchĕ
ravvagā nīdo nĕṭṭu radineserā
avvala sanna seside naṁtalone bhramasidi
sivvana nīsĕṟum̐ gĕṭṭu sedam̐ baṭṭerā

(||miṁchi||)
tadido vīḍĕ michchide talagĕkkĕ valabĕllā
yidavai nīmovi yāne dim̐ka nĕṁtarā
adiveḍuga śhrīveṁkaḍādrīśha kūḍīdivi
madilom̐ jŏkkuḍagāga mari yemanerā