మించి నా చేఁతకు నన్నే మెచ్చుట గాక
(॥పల్లవి॥)
మించి నా చేఁతకు నన్నే మెచ్చుట గాక
కొంచెపడి చెలులను గొసర నేల
(॥మించి॥)
యీకడ నీవలుపే యింత యారడిఁ బెట్టఁగ
చేకొని వుండుట గాక చింతలేలా
నీకపటాలతోడనే నీవు వద్దనుండఁగాను
చీకాకుగాఁ బరులకుఁ జెప్పనేలా
(॥మించి॥)
మనలో కాఁతాళమే మమ్మునింత సేయఁగాను
అనుభవించుట గాక అడ్డమేలా
చెనకినవాఁడవే చెక్కు నొక్కి వేఁడుకొఁగా
యెనయుట గాక మాటలింకానేలా
(॥మించి॥)
వేడుక నారతులే నీవెంట వెంటఁ దిప్పఁగాను
యీడుతో నవ్వుట గాక ఇంతేసి యేలా
కూడితివి నన్నుఁ నేఁడు గొబ్బున శ్రీవేంకటేశ
జోడయితి మిద్దరము సొలయనేలా
(||pallavi||)
miṁchi nā sem̐tagu nanne mĕchchuḍa gāga
kŏṁchĕbaḍi sĕlulanu gŏsara nela
(||miṁchi||)
yīgaḍa nīvalube yiṁta yāraḍim̐ bĕṭṭam̐ga
segŏni vuṁḍuḍa gāga siṁtalelā
nīgabaḍāladoḍane nīvu vaddanuṁḍam̐gānu
sīgāgugām̐ barulagum̐ jĕppanelā
(||miṁchi||)
manalo kām̐tāḽame mammuniṁta seyam̐gānu
anubhaviṁchuḍa gāga aḍḍamelā
sĕnaginavām̐ḍave sĕkku nŏkki vem̐ḍugŏm̐gā
yĕnayuḍa gāga māḍaliṁkānelā
(||miṁchi||)
veḍuga nāradule nīvĕṁṭa vĕṁṭam̐ dippam̐gānu
yīḍudo navvuḍa gāga iṁtesi yelā
kūḍidivi nannum̐ nem̐ḍu gŏbbuna śhrīveṁkaḍeśha
joḍayidi middaramu sŏlayanelā