మించి నా రమణుఁడవు మేనవాఁడవు
(॥పల్లవి॥)
మించి నా రమణుఁడవు మేనవాఁడవు
వంచుకొని తిద్దుకొనేవారి చేతివాఁడవు
(॥మించి॥)
వేళలు గాచితినంటా వేసరించనై తినంటా
వేలె త్తి మమ్మేల మెచ్చి వెంతసేసేవు
నీలాగు లెఱఁగనా నీవే నేఁ గానా
పాలుమాలితే నిన్నిట్టే పచ్చి సేయవలెనా
(॥మించి॥)
కొమ్మ నిన్నుఁ గంటినంటా కోపగించనైతినంటా
వుమ్మడి మాకేల మొక్కి పూరడించేవు
యెమ్మెలకాఁడవుగావా యిందుకు రాజవుగావా
దొమ్మికాఁడనై తే నీకు దూరగట్టవలెనా
(॥మించి॥)
కందువ నుండితినంటా కాఁగిలించుకొంటినంటా
ఇందరిలో మన్నించి యెంతసేసేవు
పొందినశ్రీవేంకటేశ భోగించ నింతనేరవా
అందాలకు మాటాడితే నౌఁ గాదనవలెనా
(||pallavi||)
miṁchi nā ramaṇum̐ḍavu menavām̐ḍavu
vaṁchugŏni tiddugŏnevāri sedivām̐ḍavu
(||miṁchi||)
veḽalu gāsidinaṁṭā vesariṁchanai tinaṁṭā
velĕ tti mammela mĕchchi vĕṁtasesevu
nīlāgu lĕṟam̐ganā nīve nem̐ gānā
pālumālide ninniṭṭe pachchi seyavalĕnā
(||miṁchi||)
kŏmma ninnum̐ gaṁṭinaṁṭā kobagiṁchanaidinaṁṭā
vummaḍi māgela mŏkki pūraḍiṁchevu
yĕmmĕlagām̐ḍavugāvā yiṁdugu rājavugāvā
dŏmmigām̐ḍanai te nīgu dūragaṭṭavalĕnā
(||miṁchi||)
kaṁduva nuṁḍidinaṁṭā kām̐giliṁchugŏṁṭinaṁṭā
iṁdarilo manniṁchi yĕṁtasesevu
pŏṁdinaśhrīveṁkaḍeśha bhogiṁcha niṁtaneravā
aṁdālagu māḍāḍide naum̐ gādanavalĕnā