Mimchi innidigi meegu meere jodu

మించి ఇన్నిటికి మీకు మీరే జోడు
Language

(॥పల్లవి॥)
మించి ఇన్నిటికి మీకు మీరే జోడు
మంచముపై రతులకు మంతనాలే జోడు

(॥మించి॥)
తీరని యాసలకు తియ్యనిమోవులు జోడు
మేరమీరేచిత్తాలకు మేనులే జోడు
ఆరనికాఁకలకును అంటినకాఁగిళ్లు జోడు
నేరిచిననేర్పులకు నెయ్యమే జోడు

(॥మించి॥)
చెనకుల కన్నిటికి చిమ్ముఁదమకము జోడు
ననుపులకును లేఁతనగవే జోడు
చనువుమనవులకు సన్నలు చాయలు జోడు
వొనగూడి వుండుటకు వోరుపులే జోడు

(॥మించి॥)
కలయికలకు సారెఁ గనుఁగొనుటే జోడు
అలపులకును మాటఁలాడుటే జోడు
అలమేల్మంగ శ్రీవేంకటాద్రీశ నిన్నుఁ గూడె
తలపోఁతలకు మీమీతారుకాణే జోడు

(||pallavi||)
miṁchi inniḍigi mīgu mīre joḍu
maṁchamubai radulagu maṁtanāle joḍu

(||miṁchi||)
tīrani yāsalagu tiyyanimovulu joḍu
meramīresittālagu menule joḍu
āranigām̐kalagunu aṁṭinagām̐giḽlu joḍu
nerisinanerbulagu nĕyyame joḍu

(||miṁchi||)
sĕnagula kanniḍigi simmum̐damagamu joḍu
nanubulagunu lem̐tanagave joḍu
sanuvumanavulagu sannalu sāyalu joḍu
vŏnagūḍi vuṁḍuḍagu vorubule joḍu

(||miṁchi||)
kalayigalagu sārĕm̐ ganum̐gŏnuḍe joḍu
alabulagunu māḍam̐lāḍuḍe joḍu
alamelmaṁga śhrīveṁkaḍādrīśha ninnum̐ gūḍĕ
talabom̐talagu mīmīdārugāṇe joḍu