Mimchi devaamgana litte mechcheramma

మించి దేవాంగన లిట్టె మెచ్చేరమ్మ
Language

(॥పల్లవి॥)
మించి దేవాంగన లిట్టె మెచ్చేరమ్మ
యెంచ నలమేలుమంగ యెంత దానవమ్మా

(॥మించి॥)
మాటలనే వూరడించి మచ్చికలఁ బొద్దు వుచ్చి
నీటునఁ జతిఁ దేలించ నేరుతువమ్మ
పాటలనే కరఁగించి పంతములు మరిగించి
చాటువ నాతనిఁ గూడ జాణవమ్మా

(॥మించి॥)
నగుతానే రప్పించి నటనల మెప్పించి
తగుఁబతి దక్కఁగొన దంటవమ్మా
పగటుల భ్రమయించి బడినుండే వలపించి
చిగిరించి జేయఁ బతిచిత్తము వత్తువమ్మా

(॥మించి॥)
కాఁగిటనే చొక్కించి కందువల మొక్కించి
ఆఁగి పతియురమెక్కే వప్పుడే యమ్మ
పాఁగిన శ్రీవేంకటేశు పట్టపురాణివి నీవు
నీఁగని వేడుకతోచ నీవారమమ్మా

(||pallavi||)
miṁchi devāṁgana liṭṭĕ mĕchcheramma
yĕṁcha nalamelumaṁga yĕṁta dānavammā

(||miṁchi||)
māḍalane vūraḍiṁchi machchigalam̐ bŏddu vuchchi
nīḍunam̐ jadim̐ deliṁcha neruduvamma
pāḍalane karam̐giṁchi paṁtamulu marigiṁchi
sāḍuva nādanim̐ gūḍa jāṇavammā

(||miṁchi||)
nagudāne rappiṁchi naḍanala mĕppiṁchi
tagum̐badi dakkam̐gŏna daṁṭavammā
pagaḍula bhramayiṁchi baḍinuṁḍe valabiṁchi
sigiriṁchi jeyam̐ badisittamu vattuvammā

(||miṁchi||)
kām̐giḍane sŏkkiṁchi kaṁduvala mŏkkiṁchi
ām̐gi padiyuramĕkke vappuḍe yamma
pām̐gina śhrīveṁkaḍeśhu paṭṭaburāṇivi nīvu
nīm̐gani veḍugadosa nīvāramammā