Mimche mamdemelamulu melumelu ne

మించె మందెమేళములు మేలుమేలు నే
Language

(॥పల్లవి॥)
మించె మందెమేళములు మేలుమేలు నే
కొంచ కింత వలపించుకొంటి నిది మేలునే

(॥మించె॥)
మాన కిట్టిదొరపాటిమగనితోఁ గొంకులేల
మేనిమీఁద నొరగేవు మేలుమేలునే
సానఁబట్టినచూపులు చల్లిచల్లి యేఁటికైనా
ఆనవెట్టేవు నీపై నది మేలునే

(॥మించె॥)
పక్కనను రాజసపుఁ బతితో మేలములాడి
మిక్కిలిఁ బెనఁగే విది మేలుమేలునే
చిక్కనినవ్వులు నవ్వి చేతి కాకుమడిచిచ్చి
నిక్కి నీమోవి నందుకొనేవు మేలుమేలునే

(॥మించె॥)
దార కానఁ గొంగువట్టి దంతపుటింటికిఁ దీసి
మేర గడెవెట్టుకొంటి మేలుమేలునే
యీరీతి శ్రీవేంకటేశుఁ డింతటివానిఁ గూడి
సారె నుర మెక్కితిని చనవిది మేలునే

(||pallavi||)
miṁchĕ maṁdĕmeḽamulu melumelu ne
kŏṁcha kiṁta valabiṁchugŏṁṭi nidi melune

(||miṁchĕ||)
māna kiṭṭidŏrabāḍimaganidom̐ gŏṁkulela
menimīm̐da nŏragevu melumelune
sānam̐baṭṭinasūbulu sallisalli yem̐ṭigainā
ānavĕṭṭevu nībai nadi melune

(||miṁchĕ||)
pakkananu rājasabum̐ badido melamulāḍi
mikkilim̐ bĕnam̐ge vidi melumelune
sikkaninavvulu navvi sedi kāgumaḍisichchi
nikki nīmovi naṁdugŏnevu melumelune

(||miṁchĕ||)
dāra kānam̐ gŏṁguvaṭṭi daṁtabuḍiṁṭigim̐ dīsi
mera gaḍĕvĕṭṭugŏṁṭi melumelune
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍiṁtaḍivānim̐ gūḍi
sārĕ nura mĕkkidini sanavidi melune