మిక్కిలి వేడుకయ్యీని మెచ్చల నీకతలకు
(॥పల్లవి॥)
మిక్కిలి వేడుకయ్యీని మెచ్చల నీకతలకు
చొక్కముగాఁ జెప్పవయ్య సొంపుగ వినేము
(॥మిక్కి॥)
చెంత నీవు నిక్కమూఁ జేసితివో సేయవోకాని
వింతలైన సద్దులెల్లా వింటిమి నేము
అంతలోనె దోసముగా దందుకేమీఁ గొంచించక
సంతోసానఁ జెప్పవయ్య చల్లఁగా వినేము
(॥మిక్కి॥)
కందువ నీవల్ల నవి కలవో లేవో కాని
చెంది నీ గుణములెల్లాఁ జెప్పిరి నేఁడు
అందరికిఁ గలచాలే అనుమానించఁగనేల
పొందుగానుఁ జెప్పవయ్య పొంచుక వినేము
(॥మిక్కి॥)
వుమ్మడి నీ తలఁపున నున్నదో లేదోకాని
నెమ్మది నీ విద్య లెల్లా నెగడెనేఁడు
నమ్మి లచ్చి శ్రీవెంకటేశ నన్ను నిట్టె యేలితివి
సమ్మతిగాఁ జెప్పవయ్యా చక్కఁగా వినేము
(||pallavi||)
mikkili veḍugayyīni mĕchchala nīgadalagu
sŏkkamugām̐ jĕppavayya sŏṁpuga vinemu
(||mikki||)
sĕṁta nīvu nikkamūm̐ jesidivo seyavogāni
viṁtalaina saddulĕllā viṁṭimi nemu
aṁtalonĕ dosamugā daṁdugemīm̐ gŏṁchiṁchaga
saṁtosānam̐ jĕppavayya sallam̐gā vinemu
(||mikki||)
kaṁduva nīvalla navi kalavo levo kāni
sĕṁdi nī guṇamulĕllām̐ jĕppiri nem̐ḍu
aṁdarigim̐ galasāle anumāniṁcham̐ganela
pŏṁdugānum̐ jĕppavayya pŏṁchuga vinemu
(||mikki||)
vummaḍi nī talam̐puna nunnado ledogāni
nĕmmadi nī vidya lĕllā nĕgaḍĕnem̐ḍu
nammi lachchi śhrīvĕṁkaḍeśha nannu niṭṭĕ yelidivi
sammadigām̐ jĕppavayyā sakkam̐gā vinemu