Mikkili sakkamdanaala meludaanavu

మిక్కిలి చక్కఁదనాల మేలుదానవు
Language

(॥పల్లవి॥)
మిక్కిలి చక్కఁదనాల మేలుదానవు
వొక్కటై నీ రమణుఁదు వొనగూడీ నిపుడు

(॥మిక్కి॥)
చిలుకపలుకు లవి చెలరేఁగీ వినవే
తలకొన్ననీమాఁటలవంటివి
కలువరేకు లవిగో కందువఁ జూడఁగదవే
తళుకుఁజూపుల నీకున్నులవంటివి

(॥మిక్కి॥)
వేడుకతో చందురుని వెన్నెలలు గాయవే
వాడిక నీ నవ్వులకుప్పులు వంటివి
వోడక జక్కవలతో వూరక పొందు సేయవే
జాడతోడ నీ మెరుఁగుచన్నులవంటివి

(॥మిక్కి॥)
తుమ్మిదపిల్లల నీచేతులఁ బట్టుకొనవే
పమ్మిన నీకురులజొంపాలవంటివి
యిమ్ముల శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్ను నేలె
కుమ్మరింపురతు లవే కోరికలవంటివి

(||pallavi||)
mikkili sakkam̐danāla meludānavu
vŏkkaḍai nī ramaṇum̐du vŏnagūḍī nibuḍu

(||mikki||)
silugabalugu lavi sĕlarem̐gī vinave
talagŏnnanīmām̐ṭalavaṁṭivi
kaluvaregu lavigo kaṁduvam̐ jūḍam̐gadave
taḽugum̐jūbula nīgunnulavaṁṭivi

(||mikki||)
veḍugado saṁduruni vĕnnĕlalu gāyave
vāḍiga nī navvulaguppulu vaṁṭivi
voḍaga jakkavalado vūraga pŏṁdu seyave
jāḍadoḍa nī mĕrum̐gusannulavaṁṭivi

(||mikki||)
tummidabillala nīsedulam̐ baṭṭugŏnave
pammina nīgurulajŏṁpālavaṁṭivi
yimmula śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnu nelĕ
kummariṁpuradu lave korigalavaṁṭivi