Mikkili pamtaalu nemdu meedonele

మిక్కిలి పంతాలు నేఁడు మీతోనేలే
Language

(॥పల్లవి॥)
మిక్కిలి పంతాలు నేఁడు మీతోనేలే
పక్కనఁ బైఁడమ్ములిడఁ బారవేయవలెనా

(॥॥)
ఆయలేరే యెడమాటలఁదరికిఁ జెప్పనోప
చేయిముం చాతనిఁ గంటేఁ జెప్పేలేరే
వేయకురే వొల నాపై వెన్నెలగలప్పుడే
ఆయెడ నల్లునేరేళ్ళనుట యెఱఁగరా

(॥॥)
వింటిలేరే మీమాట వీనులు చొరవు నాకు
అంటిముట్టి పతిఁ గంటే నడిగేఁబోరే
కంటకము లాడకురే గాలిగలయప్పుడే
తొంటిబాస వెళ్ళనాడి తూరుపెత్తే నిఁకను

(॥॥)
వచ్చీఁ బిలువకురే వడి నిట్టే విచ్చేసితేఁ
గొచ్చి శ్రీవేంకటపతిఁగూడే నేను
విచ్చనవిడినే యేళ్ళవెనకవే చాళ్ళవుత
తచ్చితచ్చి కాఁగిటిలోఁదారుకాణ లాయను

(||pallavi||)
mikkili paṁtālu nem̐ḍu mīdonele
pakkanam̐ baim̐ḍammuliḍam̐ bāraveyavalĕnā

(||||)
āyalere yĕḍamāḍalam̐darigim̐ jĕppanoba
seyimuṁ sādanim̐ gaṁṭem̐ jĕppelere
veyagure vŏla nābai vĕnnĕlagalappuḍe
āyĕḍa nallunereḽḽanuḍa yĕṟam̐garā

(||||)
viṁṭilere mīmāḍa vīnulu sŏravu nāgu
aṁṭimuṭṭi padim̐ gaṁṭe naḍigem̐bore
kaṁṭagamu lāḍagure gāligalayappuḍe
tŏṁṭibāsa vĕḽḽanāḍi tūrubĕtte nim̐kanu

(||||)
vachchīm̐ biluvagure vaḍi niṭṭe vichchesidem̐
gŏchchi śhrīveṁkaḍabadim̐gūḍe nenu
vichchanaviḍine yeḽḽavĕnagave sāḽḽavuda
tachchidachchi kām̐giḍilom̐dārugāṇa lāyanu