మిక్కిలి నేరుపరివి మేలెల్లా నెరుఁగుదువు
(॥పల్లవి॥)
మిక్కిలి నేరుపరివి మేలెల్లా నెరుఁగుదువు
తక్కక నీ గుణాలెల్లఁ దలఁచుకోరాదా
(॥మిక్కిలి॥)
నగితినంటా నీవు నన్నునేల జరసేవు
మొగము చూపరాదా మొక్కేఁగాని
జిగిమోవెడిగేనంటాఁ జెక్కులేల నొక్కేవు
తగు నీబాసలెల్లాఁ దలఁచుకోరాదా
(॥మిక్కిలి॥)
చూచితినంటా నన్ను సుద్దులేఁటి కడిగేవు
చే చాఁచఁగరాదా చెలఁగేఁ గాని
కాచి పాదా లొత్తేనంటా కందువలేల యంటేవు
తాచి నీవంపిన లేక దలఁచుకోరాదా
(॥మిక్కిలి॥)
కాఁగిలించుకొంటి నంటా కడు నేమి మెచ్చేవు
చేఁగ రతి చూపరాదా శ్రీవేంకటేశ
రేఁగె లమేల్మంగ నంటా రేకలేల నించేవు
దాఁగని నీవొడఁబాటు తలఁచుకోరాదా
(||pallavi||)
mikkili nerubarivi melĕllā nĕrum̐guduvu
takkaga nī guṇālĕllam̐ dalam̐sugorādā
(||mikkili||)
nagidinaṁṭā nīvu nannunela jarasevu
mŏgamu sūbarādā mŏkkem̐gāni
jigimovĕḍigenaṁṭām̐ jĕkkulela nŏkkevu
tagu nībāsalĕllām̐ dalam̐sugorādā
(||mikkili||)
sūsidinaṁṭā nannu suddulem̐ṭi kaḍigevu
se sām̐sam̐garādā sĕlam̐gem̐ gāni
kāsi pādā lŏttenaṁṭā kaṁduvalela yaṁṭevu
tāsi nīvaṁpina lega dalam̐sugorādā
(||mikkili||)
kām̐giliṁchugŏṁṭi naṁṭā kaḍu nemi mĕchchevu
sem̐ga radi sūbarādā śhrīveṁkaḍeśha
rem̐gĕ lamelmaṁga naṁṭā regalela niṁchevu
dām̐gani nīvŏḍam̐bāḍu talam̐sugorādā