మిక్కిలి మేలుది అలమేలుమంగ
(॥పల్లవి॥)
మిక్కిలి మేలుది అలమేలుమంగ
అక్కరతో నిన్నుఁ జూచీ నలమేలుమంగ
(॥॥)
కొచ్చి కొచ్చి యాళాపించి కూరిమితోఁ బాడఁగాను
మెచ్చీ నిన్ను నిదె యలమేలుమంగ
నెచ్చెలులతోడనెల్లా నీగుణాలు సారెసారె
అచ్చలాన నాడుకొనీ వలమేలుమంగ
(॥॥)
వాడలవాడల నీవు వయ్యాళిఁ దోలఁగాను
మేడలెక్కిచూచీ నలమేలుమంగ
వీడెము చేతఁబట్టుక వెస నీవు పిలువఁగా
ఆడనుండి వచ్చె నీడ కలమేలుమంగ
(॥॥)
యీలీల శ్రీ వేంకటేశ ఇంతచన వియ్యఁగాను
మేలములాడీ నల మేలుమంగ
యేలిననీరతులను ఇదె తననేరు పెల్లా
ఆలోచనలు నేసీ నల మేలుమంగా
(||pallavi||)
mikkili meludi alamelumaṁga
akkarado ninnum̐ jūsī nalamelumaṁga
(||||)
kŏchchi kŏchchi yāḽābiṁchi kūrimidom̐ bāḍam̐gānu
mĕchchī ninnu nidĕ yalamelumaṁga
nĕchchĕluladoḍanĕllā nīguṇālu sārĕsārĕ
achchalāna nāḍugŏnī valamelumaṁga
(||||)
vāḍalavāḍala nīvu vayyāḽim̐ dolam̐gānu
meḍalĕkkisūsī nalamelumaṁga
vīḍĕmu sedam̐baṭṭuga vĕsa nīvu piluvam̐gā
āḍanuṁḍi vachchĕ nīḍa kalamelumaṁga
(||||)
yīlīla śhrī veṁkaḍeśha iṁtasana viyyam̐gānu
melamulāḍī nala melumaṁga
yelinanīradulanu idĕ tananeru pĕllā
ālosanalu nesī nala melumaṁgā