మిక్కిలి మేలుదానవు మెలుఁత నీ వాతనికి
(॥పల్లవి॥)
మిక్కిలి మేలుదానవు మెలుఁత నీ వాతనికి
యెక్కడ సవతి బీరా లీతనితో నేఁటికి
(॥మిక్కి॥)
రమణి నీమొగ మెత్తి రమణునిఁ జూడవే
చెమటచెక్కులచేతిచింత లేఁటికి
సముకమున వలపు చల్లుతా మాఁటాడవే
బొమముడితోడుత పొరపొచ్చ మేఁటికి
(॥మిక్కి॥)
చెలియరో యీతనితో చిరునవ్వు నవ్వవే
సొలపులజంకెనలు చూప నేఁటికే
చెలరేఁగి విడెము చేతికి నందియ్యనే
వలవనిసటలతో వట్టిజాగు లేఁటికి
(॥మిక్కి॥)
వేవేగ జవరాల శ్రీవేంకటేశు మెచ్చవే
కోవరపుసణఁగుల గుట్టెఁటికి
యీవేళ నిన్నీతఁ డేలె యిచ్చకము శాయవే
పూవులవేటు లాడ జంపులసిగ్గు లేఁటికి
(||pallavi||)
mikkili meludānavu mĕlum̐ta nī vādanigi
yĕkkaḍa savadi bīrā līdanido nem̐ṭigi
(||mikki||)
ramaṇi nīmŏga mĕtti ramaṇunim̐ jūḍave
sĕmaḍasĕkkulasedisiṁta lem̐ṭigi
samugamuna valabu salludā mām̐ṭāḍave
bŏmamuḍidoḍuda pŏrabŏchcha mem̐ṭigi
(||mikki||)
sĕliyaro yīdanido sirunavvu navvave
sŏlabulajaṁkĕnalu sūba nem̐ṭige
sĕlarem̐gi viḍĕmu sedigi naṁdiyyane
valavanisaḍalado vaṭṭijāgu lem̐ṭigi
(||mikki||)
vevega javarāla śhrīveṁkaḍeśhu mĕchchave
kovarabusaṇam̐gula guṭṭĕm̐ṭigi
yīveḽa ninnīdam̐ ḍelĕ yichchagamu śhāyave
pūvulaveḍu lāḍa jaṁpulasiggu lem̐ṭigi