మిక్కిలి జాణవు నీవు మే మేమి బాఁతి
(॥పల్లవి॥)
మిక్కిలి జాణవు నీవు మే మేమి బాఁతి
పక్కన నీ వన్నిటాను బతికితేఁ జాలదా
(॥మిక్కిలి॥)
కూరిములు చల్లుతానె కొసరేగుణము మాది
నేరపు మా కున్నదా నేరమే కాకా
మేరతోడి మ మ్మేల మేకులు సేసేవు రతి
ధీరుఁడవు నీవు మాతెరువు రా వలెనా
(॥మిక్కిలి॥)
నించేసరసములోనె నిండువిరసము మాది
మంచితన మున్నదా మాటలే కాకా
యెంచ నేల మమ్ము నీవు యిల జాణలలో నెల్ల
అంచె నూడి పడ్డవాఁడ వంత మాతో వలెనా
(॥మిక్కిలి॥)
చనవునఁ గూడుతానె జంకించేగుణము మాది
తనివి మా కున్నదా తమియే కాకా
అనుఁగు శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
పెనఁగి కూడితి వింక బెట్టి నవ్వ వలెనా
(||pallavi||)
mikkili jāṇavu nīvu me memi bām̐ti
pakkana nī vanniḍānu badigidem̐ jāladā
(||mikkili||)
kūrimulu salludānĕ kŏsareguṇamu mādi
nerabu mā kunnadā nerame kāgā
meradoḍi ma mmela megulu sesevu radi
dhīrum̐ḍavu nīvu mādĕruvu rā valĕnā
(||mikkili||)
niṁchesarasamulonĕ niṁḍuvirasamu mādi
maṁchidana munnadā māḍale kāgā
yĕṁcha nela mammu nīvu yila jāṇalalo nĕlla
aṁchĕ nūḍi paḍḍavām̐ḍa vaṁta mādo valĕnā
(||mikkili||)
sanavunam̐ gūḍudānĕ jaṁkiṁcheguṇamu mādi
tanivi mā kunnadā tamiye kāgā
anum̐gu śhrīvĕṁkaḍeśha alamelumaṁga nenu
pĕnam̐gi kūḍidi viṁka bĕṭṭi navva valĕnā