మిక్కిలి జాణ వౌదువు మెచ్చి రిందరు నిన్ను
(॥పల్లవి॥)
మిక్కిలి జాణ వౌదువు మెచ్చి రిందరు నిన్ను
అక్కరతో నీ మహిమ అంతటాఁ జూపితివి
(॥॥)
నా కొఱకే వలచితి నన్ను నీ వింతేసి
చేకొని పెద్దరికము సేసేవు గాని
వాకమైన నీవు గుణవంతుఁ డవు గన కిట్టే
మేకొని నీ కీరితి మెరయించు కొంటివి
(॥॥)
నా వేడుకకుఁగా నే నంటున నీతో నవ్వితి
నీ వూరకే కృప నాపై నించేవు గాని
భావించి యిన్నిటా నేరుపరివి గనక నేఁడు
వే వేగ నీప్రతాపమే వెలయించుకొంటివి
(॥॥)
నాలో నీయాసలనే నమ్మి కొలువు సేసితి
పాలించి శ్రీవేంకటేశ యేలితి గానీ
మేలువాఁడవు గనక మించి యలమేల్మంగను
మేలిమి నీ మంచితనమే నిలుపుకొంటివి.
(||pallavi||)
mikkili jāṇa vauduvu mĕchchi riṁdaru ninnu
akkarado nī mahima aṁtaḍām̐ jūbidivi
(||||)
nā kŏṟage valasidi nannu nī viṁtesi
segŏni pĕddarigamu sesevu gāni
vāgamaina nīvu guṇavaṁtum̐ ḍavu gana kiṭṭe
megŏni nī kīridi mĕrayiṁchu kŏṁṭivi
(||||)
nā veḍugagum̐gā ne naṁṭuna nīdo navvidi
nī vūrage kṛpa nābai niṁchevu gāni
bhāviṁchi yinniḍā nerubarivi ganaga nem̐ḍu
ve vega nīpradābame vĕlayiṁchugŏṁṭivi
(||||)
nālo nīyāsalane nammi kŏluvu sesidi
pāliṁchi śhrīveṁkaḍeśha yelidi gānī
meluvām̐ḍavu ganaga miṁchi yalamelmaṁganu
melimi nī maṁchidaname nilubugŏṁṭivi.