Migulaam gaaminulellaa melilonivaaru gaaga

మిగులాఁ గామినులెల్లా మేలిలోనివారు గాక
Language

(॥పల్లవి॥)
మిగులాఁ గామినులెల్లా మేలిలోనివారు గాక
పగపాడే యేమైనా పంతము నెరపను

(॥మిగు॥)
వలచినకాంతను వడదేర్చవలెఁగాని
మలసి పరాకు సేయ మరి తగదు
సొలసి యాసపడితేఁ జోటియ్యవలెఁ గాని
అలరిఁ గుట్టుతో నుండు టది నీతి గాదు

(॥మిగు॥)
చుట్టమై వచ్చినిదానిఁ జూచి కూడవలెఁ గాని
వట్టి జాగులు సేసేది వైపుగాదు
నెట్టుకొన్న మాటాడితే నిలిచి వినవలెఁ గాని
బట్టబయ లిదించిఁతే బనికిరాదు

(॥మిగు॥)
లలిఁ గాఁగిలించేదాని లాలించవలెఁ గాని
పలుసుద్దు లడుగను బాడిగాదు
అలరి శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె
యెలమి నేలితి విఁక నెంచఁ బనిలేదు

(||pallavi||)
migulām̐ gāminulĕllā melilonivāru gāga
pagabāḍe yemainā paṁtamu nĕrabanu

(||migu||)
valasinagāṁtanu vaḍadersavalĕm̐gāni
malasi parāgu seya mari tagadu
sŏlasi yāsabaḍidem̐ joḍiyyavalĕm̐ gāni
alarim̐ guṭṭudo nuṁḍu ṭadi nīdi gādu

(||migu||)
suṭṭamai vachchinidānim̐ jūsi kūḍavalĕm̐ gāni
vaṭṭi jāgulu sesedi vaibugādu
nĕṭṭugŏnna māḍāḍide nilisi vinavalĕm̐ gāni
baṭṭabaya lidiṁchim̐te banigirādu

(||migu||)
lalim̐ gām̐giliṁchedāni lāliṁchavalĕm̐ gāni
palusuddu laḍuganu bāḍigādu
alari śhrīveṁkaḍeśha alamelumaṁga yīgĕ
yĕlami nelidi vim̐ka nĕṁcham̐ baniledu