Mettanimanasudaana melu daamsa ne nera

మెత్తనిమనసుదాన మేలు దాఁచ నే నేర
Language

(॥పల్లవి॥)
మెత్తనిమనసుదాన మేలు దాఁచ నే నేర
కొత్తగా నింతేసికిని గురియైతినయ్యా

(॥మెత్తని॥)
సిగ్గుపడి నీ వుండఁగ సెలవుల నవ్వు వచ్చీ
వొగ్గి మాటాడిన నవ్వు లొగి వచ్చీని
నిగ్గుల నీ రెంటికిని నీ మోవియే సాక్షి
యెగ్గులు న న్నేల పట్టే వేమి సేతు నయ్యా

(॥మెత్తని॥)
తలవంచు కుండినాను దయ నాకుఁ బుట్టీని
అలసి చూచిన దయ అట్టె పుట్టీని
మొలచి యీ రెంటికి నీ మోముకళలె సాక్షి
కులికి మమ్మేల యింత గోర నేనే వయ్యా

(॥మెత్త‌ని॥)
వూరకే నీ వుండినాను వొనరీని వలపులు
ఆరీతి నుండినా ఘన మయ్యీ వలపు
యీరీతి నీ చక్కఁదన మీ రెంటికిన సాక్షి
చేరు శ్రీవెంకటేశ మెచ్చి కూడితి వయ్యా

(||pallavi||)
mĕttanimanasudāna melu dām̐sa ne nera
kŏttagā niṁtesigini guriyaidinayyā

(||mĕttani||)
siggubaḍi nī vuṁḍam̐ga sĕlavula navvu vachchī
vŏggi māḍāḍina navvu lŏgi vachchīni
niggula nī rĕṁṭigini nī moviye sākṣhi
yĕggulu na nnela paṭṭe vemi sedu nayyā

(||mĕttani||)
talavaṁchu kuṁḍinānu daya nāgum̐ buṭṭīni
alasi sūsina daya aṭṭĕ puṭṭīni
mŏlasi yī rĕṁṭigi nī momugaḽalĕ sākṣhi
kuligi mammela yiṁta gora nene vayyā

(||mĕtta‌ni||)
vūrage nī vuṁḍinānu vŏnarīni valabulu
ārīdi nuṁḍinā ghana mayyī valabu
yīrīdi nī sakkam̐dana mī rĕṁṭigina sākṣhi
seru śhrīvĕṁkaḍeśha mĕchchi kūḍidi vayyā