Mettanidi naa manasu medivi neevu

మెత్తనిది నా మనసు మేటివి నీవు
Language

(॥పల్లవి॥)
మెత్తనిది నా మనసు మేటివి నీవు
యెత్తిన యాసలదాన యేమి సేసే నిన్నును

(॥మెత్త॥)
కోపగించవచ్చి నేను గొబ్బున నీమోము చూచి
నాపంతము విడువకే నవ్వితి నేను
చేపట్టి నీ చిత్తము వచ్చినట్టె సేయవయ్య
యీపాటిదాన నేను యేమి సే సే నిన్నును

(॥మెత్త॥)
చేయి చాఁచేనని వచ్చి చిమ్ముల నీమాఁట విని
ఆయాలు గరఁగి లోనైతి నీకును
నీ యిచ్చలోనిదాన నేఁ డిట్టె మన్నించవయ్య
యీయెడఁ జేతిలోదాన నేమి సేసే మిందును

(॥మెత్త॥)
కూరిమి గొసరవచ్చి కూడితి నీకాఁగిట
నేరుపు గలిగినట్టి నీ మహిమలు
సారపు శ్రీ వేంకటేశ సతమైనయట్టిదాన
యీరసములేనిదాన నేమిసేసే నిన్నును

(||pallavi||)
mĕttanidi nā manasu meḍivi nīvu
yĕttina yāsaladāna yemi sese ninnunu

(||mĕtta||)
kobagiṁchavachchi nenu gŏbbuna nīmomu sūsi
nābaṁtamu viḍuvage navvidi nenu
sebaṭṭi nī sittamu vachchinaṭṭĕ seyavayya
yībāḍidāna nenu yemi se se ninnunu

(||mĕtta||)
seyi sām̐senani vachchi simmula nīmām̐ṭa vini
āyālu garam̐gi lonaidi nīgunu
nī yichchalonidāna nem̐ ḍiṭṭĕ manniṁchavayya
yīyĕḍam̐ jedilodāna nemi sese miṁdunu

(||mĕtta||)
kūrimi gŏsaravachchi kūḍidi nīgām̐giḍa
nerubu galiginaṭṭi nī mahimalu
sārabu śhrī veṁkaḍeśha sadamainayaṭṭidāna
yīrasamulenidāna nemisese ninnunu