Mettani manasuna meludaana nide

మెత్తని మనసున మేలుదాన నిదె
Language

(॥పల్లవి॥)
మెత్తని మనసున మేలుదాన నిదె
చిత్తగించి దయసేయవయ్యా

(॥మెత్తని॥)
పెంచిన చిలుకలు పెక్కులు పేలీ
నంచెల నిటు మాటాడవయ్యా
పంచలకోవిల పాటలు వాడీ
కొంచక వద్దనె కూచుండవయ్యా

(॥మెత్తని॥)
గూఁటితుమ్మిదలు గొణఁగులు గొణఁగీ
గాఁటపు నీకొంగు గప్పవయ్యా
ఆటలనెమళ్ళు అవె కేఁకరించీ
నీటునఁ గాఁగిట నించవయ్యా

(॥మెత్తని॥)
జక్కవపులుగులు సగినాలు చెప్పీ
పెక్కురతుల ననుఁ బెనఁగవయ్యా
యిక్కువ శ్రీ వెంకటేశ కూడితివి
తొక్కిహంసలు దొలఁగకువయ్యా

(||pallavi||)
mĕttani manasuna meludāna nidĕ
sittagiṁchi dayaseyavayyā

(||mĕttani||)
pĕṁchina silugalu pĕkkulu pelī
naṁchĕla niḍu māḍāḍavayyā
paṁchalagovila pāḍalu vāḍī
kŏṁchaga vaddanĕ kūsuṁḍavayyā

(||mĕttani||)
gūm̐ṭidummidalu gŏṇam̐gulu gŏṇam̐gī
gām̐ṭabu nīgŏṁgu gappavayyā
āḍalanĕmaḽḽu avĕ kem̐kariṁchī
nīḍunam̐ gām̐giḍa niṁchavayyā

(||mĕttani||)
jakkavabulugulu saginālu sĕppī
pĕkkuradula nanum̐ bĕnam̐gavayyā
yikkuva śhrī vĕṁkaḍeśha kūḍidivi
tŏkkihaṁsalu dŏlam̐gaguvayyā