Meṟumguvamtidi yalamelumamga

మెఱుఁగువంటిది యలమేలుమంగ
Language

(॥పల్లవి॥)
మెఱుఁగువంటిది యలమేలుమంగ
అఱిముఱి నవ్వీని అలమేలుమంగ

(॥॥)
పలచనియెలుఁగునఁ బాడీ నీమీఁదిపాట
మెలుపుఁగూరిమి నలమేలుమంగ
చెలులతో నీసుద్ది చెప్పిచెప్పి కరఁగీని
అలయుచు సొలయుచు నలమేలుమంగ

(॥॥)
యీడుగా నీరాకకు నెదురెదురు చూచీ
మేడమీఁద నుండి యలమేలుమంగ
వాడుమోముతో నీపై వలపు చల్లిచల్లి
ఆడీ నాట్యము సారె నలమేలుమంగ

(॥॥)
పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పిచెప్పి
మేరమీర నిన్ను నలమేలుమంగ
యీరీతి శ్రీ వేంకటేశ నిన్నుఁ గూడెఁ నేఁడు
ఆరితేరె నన్నిటాను అలమేలుమంగ

(||pallavi||)
mĕṟum̐guvaṁṭidi yalamelumaṁga
aṟimuṟi navvīni alamelumaṁga

(||||)
palasaniyĕlum̐gunam̐ bāḍī nīmīm̐dibāḍa
mĕlubum̐gūrimi nalamelumaṁga
sĕlulado nīsuddi sĕppisĕppi karam̐gīni
alayusu sŏlayusu nalamelumaṁga

(||||)
yīḍugā nīrāgagu nĕdurĕduru sūsī
meḍamīm̐da nuṁḍi yalamelumaṁga
vāḍumomudo nībai valabu sallisalli
āḍī nāṭyamu sārĕ nalamelumaṁga

(||||)
perugŏni pilisīni priyamulu sĕppisĕppi
meramīra ninnu nalamelumaṁga
yīrīdi śhrī veṁkaḍeśha ninnum̐ gūḍĕm̐ nem̐ḍu
āriderĕ nanniḍānu alamelumaṁga