మెఱుఁగుఁజెక్కుల అలమేలుమంగా
(॥పల్లవి॥)
మెఱుఁగుఁజెక్కుల అలమేలుమంగా
తరి(ఱి?)తోడి రతులను దైవారవమ్మా
(॥వెఱుఁ॥)
చనవులు నీకిచ్చి చక్కనివదన మెత్తి
పెనఁగి నాతఁడు నిన్నుఁ బ్రేమతోడను
కనువిచ్చి చూడవమ్మ కందువల నవ్వవమ్మ
మనసిచ్చి యాతనితో మాటలాడవమ్మా
(॥మెఱుఁ॥)
పొందులు నీతో నెరపి పూఁచి నీపైఁ జేయివేసి
చిందీ నీపై నతఁడు చిఱుఁజెమట
విందుల మోవియ్యవమ్మ వేడుకలు చూపవమ్మ
అందుకొని ఆకుమడి చాతని కీవమ్మా
(॥మెఱుఁ॥)
గక్కుననుఁ గాఁగిలించి కరుణ నీపై నించి
ఇక్కువఁ గూడె శ్రీ వేంకటేశుఁడు నిన్ను
వక్కణ లడుగవమ్మ వన్నెలెల్లాఁ జూపవమ్మ
నిక్కుచు నురముమీఁద నిండుకొనవమ్మా
(||pallavi||)
mĕṟum̐gum̐jĕkkula alamelumaṁgā
tari(ṟi?)toḍi radulanu daivāravammā
(||vĕṟum̐||)
sanavulu nīgichchi sakkanivadana mĕtti
pĕnam̐gi nādam̐ḍu ninnum̐ bremadoḍanu
kanuvichchi sūḍavamma kaṁduvala navvavamma
manasichchi yādanido māḍalāḍavammā
(||mĕṟum̐||)
pŏṁdulu nīdo nĕrabi pūm̐si nībaim̐ jeyivesi
siṁdī nībai nadam̐ḍu siṟum̐jĕmaḍa
viṁdula moviyyavamma veḍugalu sūbavamma
aṁdugŏni āgumaḍi sādani kīvammā
(||mĕṟum̐||)
gakkunanum̐ gām̐giliṁchi karuṇa nībai niṁchi
ikkuvam̐ gūḍĕ śhrī veṁkaḍeśhum̐ḍu ninnu
vakkaṇa laḍugavamma vannĕlĕllām̐ jūbavamma
nikkusu nuramumīm̐da niṁḍugŏnavammā