Merasi seppamgam bole medibamtibona maunu

మెరసి చెప్పఁగఁ బోలే మేడిపంటిబోన మౌను
Language

(॥పల్లవి॥)
మెరసి చెప్పఁగఁ బోలే మేడిపంటిబోన మౌను
యెరవేల సతమౌను యేతు లింతే కాక

(॥మెరసి॥)
అతనిఁ బిలువఁ బోతే యంగన నీ మోవి పొక్కె
వెతల నీ కది యెంత వేఁడో కాని
అతనికి వూవు లంప నవే నీ మీఁ జేయినాఁటె
అతఁడే గతుల నీచే నందుకొనెనో

(॥మెరసి॥)
గందము నీ వియ్యఁ బోతే కాఁక నీ మై చెమరించె
యిందు నీవేళ గుణము యెట్టిదో కాని
కందువ వీడె మంపితే కన్నుల నీకుఁ గెం పెక్కె
అందు నిందు నాము లెక్కి ఆయ మెట్టు దాఁకెనో

(॥మెరసి॥)
తోవ కెదురంపితేను తొయ్యలి నీ కొప్పు వీడె
చేవదేర నాత డేమి సేసెనో కాని
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి యిదె నన్నుఁ గూడె
భావములు నీ యంద బయలాయఁ గాని

(||pallavi||)
mĕrasi sĕppam̐gam̐ bole meḍibaṁṭibona maunu
yĕravela sadamaunu yedu liṁte kāga

(||mĕrasi||)
adanim̐ biluvam̐ bode yaṁgana nī movi pŏkkĕ
vĕdala nī kadi yĕṁta vem̐ḍo kāni
adanigi vūvu laṁpa nave nī mīm̐ jeyinām̐ṭĕ
adam̐ḍe gadula nīse naṁdugŏnĕno

(||mĕrasi||)
gaṁdamu nī viyyam̐ bode kām̐ka nī mai sĕmariṁchĕ
yiṁdu nīveḽa guṇamu yĕṭṭido kāni
kaṁduva vīḍĕ maṁpide kannula nīgum̐ gĕṁ pĕkkĕ
aṁdu niṁdu nāmu lĕkki āya mĕṭṭu dām̐kĕno

(||mĕrasi||)
tova kĕduraṁpidenu tŏyyali nī kŏppu vīḍĕ
sevadera nāda ḍemi sesĕno kāni
śhrīveṁkaḍeśhvarum̐ḍu seri yidĕ nannum̐ gūḍĕ
bhāvamulu nī yaṁda bayalāyam̐ gāni