మేరమీరకువె యలమేలుమంగను నేను
(॥పల్లవి॥)
మేరమీరకువె యలమేలుమంగను నేను
యే రీతిఁ బెనఁగనేలే యీతఁడు నా మగఁడు
(॥॥)
చెక్కుల జవ్వాది వడిసీఁ దుడుచుకొనవే
అక్కర నేమిచూచేవు అతనిదిక్కు
వెక్కసపువలపుల వేడుకకత్తె వౌదువు
ఇక్కువ లంటకువే యీతఁడు నామగఁడ
(॥॥)
కోరి జారినపయ్యదకొంగు చక్కఁబెట్టుకోవే
కూరి మేమిగొసరేవు కొంక కాతని
చేరుగొండి తనములు చెలిమికత్తె వౌదువు
యీరుదియ్యఁ బేను వచ్చు నితఁ డు నామగఁడు
(॥॥)
కుఁమ్ముడి వీడె నిదె కొప్పుముడుచుకొనవే
యెమ్మెల కాతనితోడ నేమినవ్వేవు
నెమ్మది నన్నేలె నిట్టె నీవూఁ జుట్టమ వౌదువు
ఇమ్ముల శ్రీ వేంకటేశుఁ డితఁడు నామగఁడు
(||pallavi||)
meramīraguvĕ yalamelumaṁganu nenu
ye rīdim̐ bĕnam̐ganele yīdam̐ḍu nā magam̐ḍu
(||||)
sĕkkula javvādi vaḍisīm̐ duḍusugŏnave
akkara nemisūsevu adanidikku
vĕkkasabuvalabula veḍugagattĕ vauduvu
ikkuva laṁṭaguve yīdam̐ḍu nāmagam̐ḍa
(||||)
kori jārinabayyadagŏṁgu sakkam̐bĕṭṭugove
kūri memigŏsarevu kŏṁka kādani
serugŏṁḍi tanamulu sĕlimigattĕ vauduvu
yīrudiyyam̐ benu vachchu nidam̐ ḍu nāmagam̐ḍu
(||||)
kum̐mmuḍi vīḍĕ nidĕ kŏppumuḍusugŏnave
yĕmmĕla kādanidoḍa neminavvevu
nĕmmadi nannelĕ niṭṭĕ nīvūm̐ juṭṭama vauduvu
immula śhrī veṁkaḍeśhum̐ ḍidam̐ḍu nāmagam̐ḍu