మేరకు మేరే కాక మీర వచ్చునా
(॥పల్లవి॥)
మేరకు మేరే కాక మీర వచ్చునా
ఆరీతి నారడి యైతే నంద మవునా మాటలు
(॥మెరకు॥)
మొగమోట గలచోట ముంచి వా దడువ నేల
నగితోనె చాలదా నయముగాను
తెగనాడేమాట లెల్ల తెలుసుకోనీ నాతఁడె
జగడ మయినమీఁద చక్క నవునా పనులు
(॥మేరకు॥)
యెగ్గు పట్ట రానిచోట యెక్కువ తక్కువ లెల్ల
సిగ్గు వడుటే చాలదా సిరసు వంచి
దగ్గరి కాఁ గలపని తనుఁ దానె తోఁచీని
కగ్గినందుమీఁద పతిఁ గైకొలుప వసమా
(॥మేరకు॥)
మన నెరిఁగినచోట మరి యెడమాట లేల
పెనఁగుటే చాలదా ప్రియముతోడ
యెనసె శ్రీవెంటకేశుఁ డింతలోఁ దానె నిన్ను
చన మిచ్చినందుమీఁదఁ జలములు గలవా
(||pallavi||)
meragu mere kāga mīra vachchunā
ārīdi nāraḍi yaide naṁda mavunā māḍalu
(||mĕragu||)
mŏgamoḍa galasoḍa muṁchi vā daḍuva nela
nagidonĕ sāladā nayamugānu
tĕganāḍemāḍa lĕlla tĕlusugonī nādam̐ḍĕ
jagaḍa mayinamīm̐da sakka navunā panulu
(||meragu||)
yĕggu paṭṭa rānisoḍa yĕkkuva takkuva lĕlla
siggu vaḍuḍe sāladā sirasu vaṁchi
daggari kām̐ galabani tanum̐ dānĕ tom̐sīni
kagginaṁdumīm̐da padim̐ gaigŏluba vasamā
(||meragu||)
mana nĕrim̐ginasoḍa mari yĕḍamāḍa lela
pĕnam̐guḍe sāladā priyamudoḍa
yĕnasĕ śhrīvĕṁṭageśhum̐ ḍiṁtalom̐ dānĕ ninnu
sana michchinaṁdumīm̐dam̐ jalamulu galavā