Meragu mere kaaga meera nemtige

మేరకు మేరే కాక మీర నేఁటికే
Language

(॥పల్లవి॥)
మేరకు మేరే కాక మీర నేఁటికే
నేరుపులు చాలు జాలు నెరవేరెఁ బనులు

(॥మేరకు॥)
వద్దు వద్దేమీఁ దడవకురే మీరు వా
రిద్దరు లోన నుండఁగ నేలే దోసము
కొద్ది మీరి దగ్గరితే కూళ వందురు
తిద్ద నేల పను లెల్లఁ దీరినమీఁదటను

(॥మేరకు॥)
చేకొని మీ రెరుకలు సేసుకొందురా వా
రేకత మయినవేళ యేలె దోసము
కాకు నేయఁ బోతే నన్నే కల్లందురు
లోకమువారే చెప్పేరు లోలోనే వారికి

(॥మేరకు॥)
తెక్కులవాకి లిప్పుడే తెరవకురే వా
రిక్కువఁ గరఁగేవేళ యేలే దోసము
మొక్కి శ్రీవెంకటపతి మొకమోట నన్నుఁ గూడె
నెక్కుడు మా టేల పంత మిచ్చినమీఁదుటనూ

(||pallavi||)
meragu mere kāga mīra nem̐ṭige
nerubulu sālu jālu nĕraverĕm̐ banulu

(||meragu||)
vaddu vaddemīm̐ daḍavagure mīru vā
riddaru lona nuṁḍam̐ga nele dosamu
kŏddi mīri daggaride kūḽa vaṁduru
tidda nela panu lĕllam̐ dīrinamīm̐daḍanu

(||meragu||)
segŏni mī rĕrugalu sesugŏṁdurā vā
regada mayinaveḽa yelĕ dosamu
kāgu neyam̐ bode nanne kallaṁduru
logamuvāre sĕpperu lolone vārigi

(||meragu||)
tĕkkulavāgi lippuḍe tĕravagure vā
rikkuvam̐ garam̐geveḽa yele dosamu
mŏkki śhrīvĕṁkaḍabadi mŏgamoḍa nannum̐ gūḍĕ
nĕkkuḍu mā ṭela paṁta michchinamīm̐duḍanū