Meragu merai vumduda melugaadaa

మేరకు మేరై వుండుట మేలుగాదా
Language

(॥పల్లవి॥)
మేరకు మేరై వుండుట మేలుగాదా
కారణములేని వట్టి కలఁకలేలా

(॥మేర॥)
పంతము దొలుతనాడి పలుమారు నందుకుఁగా
వంతువాసులెక్కించుక వాదు నీకేల
యింతలోఁగన్నీరునించి యెదురు మాటాడుతాను
చింతతోడఁ దలవంచే సిలుగు నాకేల

(॥మేర॥)
వనితెనొక్కతెఁ జూపి వలవనిబొంకు బొంకి
వెనక నానలు వెట్టేవెద నీకెల
తనువునఁ గాఁక రేఁగి తలఁబట్టు వెట్టుకొని
మనసు రాక యలిగేమంకులు నాకేల

(॥మేర॥)
యేకతాన నన్నుఁ గూడి యెవ్వతెఁ జెనక రాక
మైకొని వుండేటినేమము నీకేల
కైకొని శ్రీవేంకటేశ కలసితి నింతలోనే
రాక వుంటిననేటి నేరము నాకేల

(||pallavi||)
meragu merai vuṁḍuḍa melugādā
kāraṇamuleni vaṭṭi kalam̐kalelā

(||mera||)
paṁtamu dŏludanāḍi palumāru naṁdugum̐gā
vaṁtuvāsulĕkkiṁchuga vādu nīgela
yiṁtalom̐gannīruniṁchi yĕduru māḍāḍudānu
siṁtadoḍam̐ dalavaṁche silugu nāgela

(||mera||)
vanidĕnŏkkadĕm̐ jūbi valavanibŏṁku bŏṁki
vĕnaga nānalu vĕṭṭevĕda nīgĕla
tanuvunam̐ gām̐ka rem̐gi talam̐baṭṭu vĕṭṭugŏni
manasu rāga yaligemaṁkulu nāgela

(||mera||)
yegadāna nannum̐ gūḍi yĕvvadĕm̐ jĕnaga rāga
maigŏni vuṁḍeḍinemamu nīgela
kaigŏni śhrīveṁkaḍeśha kalasidi niṁtalone
rāga vuṁṭinaneḍi neramu nāgela