మేరకు మేర నుండుటే మెచ్చుటగాక
(॥పల్లవి॥)
మేరకు మేర నుండుటే మెచ్చుటగాక
కోరి వాదులాటలేలే కొలమునాండ్లకును
(॥మేర॥)
నిక్కినిక్కి పతిఁజూడ నీకునెంట చెల్లుఁబడే
వొక్కటై యాతఁడు నావొద్ద నుండఁగా
పుక్కిటి వీడెము చూపి బూటకము సేసేవు
మొక్కలము లింతయేలే మొగనాండ్లకును
(॥మేర॥)
సన్న సేసే వాతఁడు నాసంగడినే వుండఁగాను
యెన్నఁడు నాలాడు నీ వెఱఁగవటే
కన్నుల సొలసేవేమే కమ్మర నాతని నీవు
యిన్నేసిచేఁతలేలే యిల్లాండ్లకును
(॥మేర॥)
చెంది గోరు దియ్యనేలే శ్రీవేంకటేశుఁ డిట్టె
పొంది నాతోఁ బరవశంబున నుండఁగా
కందువ బైపై నీవు కాతరానఁ దిరిగేవు
సందడి సేయఁగనేల సవతాండ్లకును
(||pallavi||)
meragu mera nuṁḍuḍe mĕchchuḍagāga
kori vādulāḍalele kŏlamunāṁḍlagunu
(||mera||)
nikkinikki padim̐jūḍa nīgunĕṁṭa sĕllum̐baḍe
vŏkkaḍai yādam̐ḍu nāvŏdda nuṁḍam̐gā
pukkiḍi vīḍĕmu sūbi būḍagamu sesevu
mŏkkalamu liṁtayele mŏganāṁḍlagunu
(||mera||)
sanna sese vādam̐ḍu nāsaṁgaḍine vuṁḍam̐gānu
yĕnnam̐ḍu nālāḍu nī vĕṟam̐gavaḍe
kannula sŏlaseveme kammara nādani nīvu
yinnesisem̐talele yillāṁḍlagunu
(||mera||)
sĕṁdi goru diyyanele śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ
pŏṁdi nādom̐ baravaśhaṁbuna nuṁḍam̐gā
kaṁduva baibai nīvu kādarānam̐ dirigevu
saṁdaḍi seyam̐ganela savadāṁḍlagunu