Merado ne numdamgaanu meesedi baadha bettu

మేరతో నే నుండఁగాను మీచేతి బాధ బెట్టు
Language

(॥పల్లవి॥)
మేరతో నే నుండఁగాను మీచేతి బాధ బెట్టు
వూరకున్నవారి నేల వుడికించేరే

(॥మేరతో॥)
వొట్టి పతికిఁ బాదము లొత్తి వచ్చితి నిందాఁకా
యిట్టె యలిగితి నంటా నేల పోరేరే
వెట్ట దీరఁగ సురటి విసరితి నాతనకి
చిట్టకాన కింకా నేమి సేయు మనేరే

(॥మేరతో॥)
సన్నతో నేనిందాఁక సముకాననే వుంటి
చిన్నఁబోతి నంటా నేల చేయి వట్టెరే
మున్నె యాతనూడిగాన ముక్కు చెమట జారితే
కన్నీరు రాలె నంటా గడియించే రేటికే

(॥మేరతో॥)
ముక్కువ శ్రీవెంకటేశు మాటలు వింటి నిందాఁక
వొక్కటి గమ్మంటా నేల వొడి వట్టేరే
అక్కరతో నాతఁడె ఆదరించి నన్నుఁ గూడె
మొక్కనైతి నంటా నేల మొరఁగు లాడేరే

(||pallavi||)
merado ne nuṁḍam̐gānu mīsedi bādha bĕṭṭu
vūragunnavāri nela vuḍigiṁchere

(||merado||)
vŏṭṭi padigim̐ bādamu lŏtti vachchidi niṁdām̐kā
yiṭṭĕ yaligidi naṁṭā nela porere
vĕṭṭa dīram̐ga suraḍi visaridi nādanagi
siṭṭagāna kiṁkā nemi seyu manere

(||merado||)
sannado neniṁdām̐ka samugānane vuṁṭi
sinnam̐bodi naṁṭā nela seyi vaṭṭĕre
munnĕ yādanūḍigāna mukku sĕmaḍa jāride
kannīru rālĕ naṁṭā gaḍiyiṁche reḍige

(||merado||)
mukkuva śhrīvĕṁkaḍeśhu māḍalu viṁṭi niṁdām̐ka
vŏkkaḍi gammaṁṭā nela vŏḍi vaṭṭere
akkarado nādam̐ḍĕ ādariṁchi nannum̐ gūḍĕ
mŏkkanaidi naṁṭā nela mŏram̐gu lāḍere