Menavaara middaramu mechchulaayam banulu

మేనవార మిద్దరము మెచ్చులాయఁ బనులు
Language

(॥పల్లవి॥)
మేనవార మిద్దరము మెచ్చులాయఁ బనులు
యీ నేరుపులు గంటి నిఁక నేఁటి మరఁగు

(॥॥)
నవ్వులేమి నవ్వీనే నయగారి తనమున
జవ్వన పాయమెల్లా జట్టిగొనెను
రవ్వలాయ మావలపు రమ్మనవే యింటాడకు
యెవ్వరూ నేమి చెప్పేరు యికనేఁటి మరఁగు

(॥॥)
సుద్దులేమి చెప్పీనే చుట్టరికములనే
గద్దరి నామనసు తాఁ గైకొనెను
పెద్దాయ నాసలు పెనఁగి చూడుమనవే
యిద్దరము నిద్దరమే యిఁక నేఁటి మరఁగు

(॥॥)
తప్ప కేమి చూచీన తన తరితీపులనే
వొప్పుగ నాకాఁగిట నొనగూడేను
చిప్పిలె నా చెమటలు శ్రీవేంకటేశుఁడు తాను
యెప్పుడూ నన్ను మన్నించు నిఁక నేఁటి మరఁగు

(||pallavi||)
menavāra middaramu mĕchchulāyam̐ banulu
yī nerubulu gaṁṭi nim̐ka nem̐ṭi maram̐gu

(||||)
navvulemi navvīne nayagāri tanamuna
javvana pāyamĕllā jaṭṭigŏnĕnu
ravvalāya māvalabu rammanave yiṁṭāḍagu
yĕvvarū nemi sĕpperu yiganem̐ṭi maram̐gu

(||||)
suddulemi sĕppīne suṭṭarigamulane
gaddari nāmanasu tām̐ gaigŏnĕnu
pĕddāya nāsalu pĕnam̐gi sūḍumanave
yiddaramu niddarame yim̐ka nem̐ṭi maram̐gu

(||||)
tappa kemi sūsīna tana taridībulane
vŏppuga nāgām̐giḍa nŏnagūḍenu
sippilĕ nā sĕmaḍalu śhrīveṁkaḍeśhum̐ḍu tānu
yĕppuḍū nannu manniṁchu nim̐ka nem̐ṭi maram̐gu