మేము విన్నవించరాదు మీలోని మర్మములు
(॥పల్లవి॥)
మేము విన్నవించరాదు మీలోని మర్మములు
ఆమని వలపు చల్లి అంగవించరాదా
(॥మేము॥)
చిత్తడిచెమటతోడిసిగ్గులేల పతితోడ
చిత్తములోపలిమాట చెప్పరాదా
వత్తివలె మోవిమీఁది వసివాడులేమిటికి
పొత్తుకు వచ్చి యీతనిఁ బోదిసేయరాదా
(॥మేము॥)
మంచిరనపులకలతో ముసిముసినవ్వులేల
చుంచుల నీవేడుకలు చూపరాదా
అంచెల నిట్టూరుపులఅసురుసు రేమిటికి
మంచముపైఁ గూచుండి మరుపఁగరాదా
(॥మేము॥)
నిండుమోముకళలతో నిట్టచూపు చూడనేల
దండిగాఁ గాఁగిట నించి దైవారరాదా
అండనె శ్రీవేంకటేశుఁ డాతఁడే నిన్ను నలమె
కొండలవంటిచన్నుల(లఁ?) గుచ్చియెత్తరాదా
(||pallavi||)
memu vinnaviṁcharādu mīloni marmamulu
āmani valabu salli aṁgaviṁcharādā
(||memu||)
sittaḍisĕmaḍadoḍisiggulela padidoḍa
sittamulobalimāḍa sĕpparādā
vattivalĕ movimīm̐di vasivāḍulemiḍigi
pŏttugu vachchi yīdanim̐ bodiseyarādā
(||memu||)
maṁchiranabulagalado musimusinavvulela
suṁchula nīveḍugalu sūbarādā
aṁchĕla niṭṭūrubulaasurusu remiḍigi
maṁchamubaim̐ gūsuṁḍi marubam̐garādā
(||memu||)
niṁḍumomugaḽalado niṭṭasūbu sūḍanela
daṁḍigām̐ gām̐giḍa niṁchi daivārarādā
aṁḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍe ninnu nalamĕ
kŏṁḍalavaṁṭisannula(lam̐?) guchchiyĕttarādā