Melusuddi seppidenu mechchavaddaa imkanainaa

మేలుసుద్ది చెప్పితేను మెచ్చవద్దా ఇఁకనైనా
Language

(॥పల్లవి॥)
మేలుసుద్ది చెప్పితేను మెచ్చవద్దా ఇఁకనైనా
కాలుదొక్కుదువు పాన్పుకడకు రావయ్యా

(॥మేలు॥)
వెలఁది యొకతె నిన్ను వెదకీ నేమిటికో
సొలవక నీ మొగము చూపవయ్యా
పిలిచీ నప్పటనుండి పెదపెదయెలుఁగుల
పలుకవయ్యా యేల పరాకు నీకు

(॥మేలు॥)
వొడినేమోపెట్టుకొనివుండి నిన్నే తలఁచీని
అడిగాపెఁ దెలుసుకోవయ్యా నీవు
నడివనీది నిలుచుండి నన్ను నీకడకు నంపె
విడిది నీపొరుగే యీవింతలేల నీకు

(॥మేలు॥)
చేపమీద నేకతము చెప్పేనంటా నున్నది
నావంటిదే తానూనేమి చెప్పేవయ్యా
శ్రీవేంకటేశ నన్నుఁ జేరి యిట్టె కూడితివి
సేవించే నాపెనే నేను చెప్ప నేల నీకూ

(||pallavi||)
melusuddi sĕppidenu mĕchchavaddā im̐kanainā
kāludŏkkuduvu pānpugaḍagu rāvayyā

(||melu||)
vĕlam̐di yŏgadĕ ninnu vĕdagī nemiḍigo
sŏlavaga nī mŏgamu sūbavayyā
pilisī nappaḍanuṁḍi pĕdabĕdayĕlum̐gula
palugavayyā yela parāgu nīgu

(||melu||)
vŏḍinemobĕṭṭugŏnivuṁḍi ninne talam̐sīni
aḍigābĕm̐ dĕlusugovayyā nīvu
naḍivanīdi nilusuṁḍi nannu nīgaḍagu naṁpĕ
viḍidi nībŏruge yīviṁtalela nīgu

(||melu||)
sebamīda negadamu sĕppenaṁṭā nunnadi
nāvaṁṭide tānūnemi sĕppevayyā
śhrīveṁkaḍeśha nannum̐ jeri yiṭṭĕ kūḍidivi
seviṁche nābĕne nenu sĕppa nela nīgū