మేలురా నీ కతలకు మెచ్చితి నేను
(॥పల్లవి॥)
మేలురా నీ కతలకు మెచ్చితి నేను
మేలములాడితి నీవు మెచ్చులాఁడివంటానే
(॥॥)
వెన్నలేల తీసేవురా చిన్నవాఁడా నీ
చన్నులపై పయ్యదేల జారెనె నీకు
యెన్నిక నేమాటకు నీవేమాడేవు అది
జన్నెపాలువట్టినమాచాడెలంటానే
(॥॥)
వుట్టులేల యెక్కేవురా వుద్దండీఁడా చక్కఁ-
గట్టుకోవె పోఁకముడి కదలె నీకు
వొట్టుక నేనొకటంటే నొకటాడేవు అది
తొట్టి రతులసిగ్గులదొడ్డియంటానే
(॥॥)
చేరి యిల్లు చొచ్చేవేరా శ్రీవేంకటేశ నీవు
తారసిల్లి వొంటినే వుందానవంటానె
కోరి నన్ను గాగిలించి కొత్తలుగా నాడేవు
దూరనేలే గొల్లవారి దోమటంటానే
(||pallavi||)
melurā nī kadalagu mĕchchidi nenu
melamulāḍidi nīvu mĕchchulām̐ḍivaṁṭāne
(||||)
vĕnnalela tīsevurā sinnavām̐ḍā nī
sannulabai payyadela jārĕnĕ nīgu
yĕnniga nemāḍagu nīvemāḍevu adi
jannĕbāluvaṭṭinamāsāḍĕlaṁṭāne
(||||)
vuṭṭulela yĕkkevurā vuddaṁḍīm̐ḍā sakkam̐-
gaṭṭugovĕ pom̐kamuḍi kadalĕ nīgu
vŏṭṭuga nenŏgaḍaṁṭe nŏgaḍāḍevu adi
tŏṭṭi radulasigguladŏḍḍiyaṁṭāne
(||||)
seri yillu sŏchcheverā śhrīveṁkaḍeśha nīvu
tārasilli vŏṁṭine vuṁdānavaṁṭānĕ
kori nannu gāgiliṁchi kŏttalugā nāḍevu
dūranele gŏllavāri domaḍaṁṭāne