మెలుఁతలు బెళుకుల మెఱసినను
(॥పల్లవి॥)
మెలుఁతలు బెళుకుల మెఱసినను
నిలువునఁ గాంతలో నీడలు నిలిచె
(॥మెలు॥)
మలవుల నాడుచు మగువలు నీపై
సొలసిసొలసి నినుఁ జూడఁగాను
నిలువున నీమై నీలపుసరులై
కలువదండలై కలగొన బెరసె
(॥మెలుఁ॥)
మునుకొని యిద్దరు మురిపెపునడపుల
చెనకి కరజములఁ జెన్ను గను
పెనగొనువజ్రపుఁబేరులసొమ్ములు
తనుకాంతులలోఁ దగులములాయ
(॥మెలుఁ॥)
తిరుపుగొనుచు నినుఁ దేఁకువ నొరయుచు
సరుసనె నగవులు చల్లినను
గరిమల శ్రీవేంకటపతి నీకివి
తెరమరఁగురతుల తేజములాయ
(||pallavi||)
mĕlum̐talu bĕḽugula mĕṟasinanu
niluvunam̐ gāṁtalo nīḍalu nilisĕ
(||mĕlu||)
malavula nāḍusu maguvalu nībai
sŏlasisŏlasi ninum̐ jūḍam̐gānu
niluvuna nīmai nīlabusarulai
kaluvadaṁḍalai kalagŏna bĕrasĕ
(||mĕlum̐||)
munugŏni yiddaru muribĕbunaḍabula
sĕnagi karajamulam̐ jĕnnu ganu
pĕnagŏnuvajrabum̐berulasŏmmulu
tanugāṁtulalom̐ dagulamulāya
(||mĕlum̐||)
tirubugŏnusu ninum̐ dem̐kuva nŏrayusu
sarusanĕ nagavulu sallinanu
garimala śhrīveṁkaḍabadi nīgivi
tĕramaram̐guradula tejamulāya