మెలుఁతలందురును మెచ్చిరమ్మా
(॥పల్లవి॥)
మెలుఁతలందురును మెచ్చిరమ్మా
వలపు లొక్కమాఁటె పంచితివమ్మా
(॥మెలుఁ॥)
మారుగొండ లెక్కితివి మగనితొ డేక్కితివి
నేరుపరి వౌదువు నీవమ్మా
సారె జారించి పయ్యద చన్నులు చూపితివి
నీరపమాయ నింక నెరజాణవమ్మా
(॥మెలుఁ॥)
బొమ్మలను జంకించిబుద్దులెల్ల బోదించి
చిమ్మేటికోపము మానిచితివమ్మా
తమ్మిమోము మోము చేర్చి దప్పి దేర మోవి ఇచ్చి
కుమ్మరించితివిసిగ్గు గుణవతివమ్మా
(॥మెలుఁ॥)
పాదము పాదానఁ దొక్కిపక్కన చెక్కులు నొక్కి
సేదదేర్చితివి నీకు చెల్లునమ్మా
ఆదిగొని శ్రీవేంకటమందు అహోబలేశ్వరు
సాదుఁ జేసితివి మంచిచక్కనిలక్ష్మివమ్మా
(||pallavi||)
mĕlum̐talaṁdurunu mĕchchirammā
valabu lŏkkamām̐ṭĕ paṁchidivammā
(||mĕlum̐||)
mārugŏṁḍa lĕkkidivi maganidŏ ḍekkidivi
nerubari vauduvu nīvammā
sārĕ jāriṁchi payyada sannulu sūbidivi
nīrabamāya niṁka nĕrajāṇavammā
(||mĕlum̐||)
bŏmmalanu jaṁkiṁchibuddulĕlla bodiṁchi
simmeḍigobamu mānisidivammā
tammimomu momu sersi dappi dera movi ichchi
kummariṁchidivisiggu guṇavadivammā
(||mĕlum̐||)
pādamu pādānam̐ dŏkkibakkana sĕkkulu nŏkki
sedadersidivi nīgu sĕllunammā
ādigŏni śhrīveṁkaḍamaṁdu ahobaleśhvaru
sādum̐ jesidivi maṁchisakkanilakṣhmivammā