Melumta limdarum gadi mee rela vachchidiramma

మెలుఁత లిందరుఁ గడి మీ రేల వచ్చితిరమ్మ
Language

(॥పల్లవి॥)
మెలుఁత లిందరుఁ గడి మీ రేల వచ్చితిరమ్మ
కలివోసినా నుట్లకడ చూడనేలే

(॥మెలు॥)
అండకు వచ్చినవేళ నపుడూరకుండి నన్ను
వుండుండి పిలువనంపె నూరకిదేలే
నిండిన యీ ప్రియములు నేరఁదాయనా అపుడు
చండిపెట్టి కూడఁబోతే చౌకే కాదా

(॥మెలు॥)
పై పై మాటలాడేవేళ పరాకు సేసుకవుండి
యీపొద్దు ఆసుద్దడిగీ ఇంకా నేలే
దాపగు యీ తలపులు దాఁచుకుండెనా అపుడు
మాపులే రేపులైతే మనసులెనసునా

(॥మెలు॥)
ముచ్చటలాడేటివేళ మొకము వంచుక వుండి
యిచ్చట సరసమాడీ నిదివో యేలే
యిచ్చగించి శ్రీ వేంకటేశుఁ డిదె నన్నుఁగూడె
వచ్చివచ్చి రాకున్న వాడిక లేదనరే

(||pallavi||)
mĕlum̐ta liṁdarum̐ gaḍi mī rela vachchidiramma
kalivosinā nuṭlagaḍa sūḍanele

(||mĕlu||)
aṁḍagu vachchinaveḽa nabuḍūraguṁḍi nannu
vuṁḍuṁḍi piluvanaṁpĕ nūragidele
niṁḍina yī priyamulu neram̐dāyanā abuḍu
saṁḍibĕṭṭi kūḍam̐bode sauge kādā

(||mĕlu||)
pai pai māḍalāḍeveḽa parāgu sesugavuṁḍi
yībŏddu āsuddaḍigī iṁkā nele
dābagu yī talabulu dām̐suguṁḍĕnā abuḍu
mābule rebulaide manasulĕnasunā

(||mĕlu||)
muchchaḍalāḍeḍiveḽa mŏgamu vaṁchuga vuṁḍi
yichchaḍa sarasamāḍī nidivo yele
yichchagiṁchi śhrī veṁkaḍeśhum̐ ḍidĕ nannum̐gūḍĕ
vachchivachchi rāgunna vāḍiga ledanare