Melumta keppudu neevu meluvaamdavu

మెలుఁత కెప్పుడు నీవు మేలువాఁడవు
Language

(॥పల్లవి॥)
మెలుఁత కెప్పుడు నీవు మేలువాఁడవు
తలఁపులో నిఁక దయదలఁచఁగ రాదా

(॥మెలు॥)
కన్నుల నీకు మొక్కెఁ గాంత వద్దఁగూచుండి
విన్నపాలు సేసుకొని వేఁడుకొనెను
సన్నలనే మోవిచూపె చనవు చేకొని యింక
మన్నించి లోనికేంగి మాటలాడరాదా

(॥మెలు॥)
వాడికతోఁ జెక్కునొక్కి వలపు నీకెరిఁగించె
వీడెము చేతికిచ్చి వేఁడుకొనెను
జొడగుచన్నుల నొత్తె చొక్కుచుఁ దెరవేసుక
యీడనైనా సేవలు సేయించుకొరాదా

(॥మెలు॥)
కొలువులు నీకు జేసె కూరిమిఁ బ్రియాలు చెప్పె
వెలయఁగఁ గాఁగిలించె వేఁడుకొనెను
పిలిచి ఇందాఁకా నీతోఁ బెనఁగె శ్రీవేంకటే
తలుపుమూసుక రతిఁ దనియించరాదా

(||pallavi||)
mĕlum̐ta kĕppuḍu nīvu meluvām̐ḍavu
talam̐pulo nim̐ka dayadalam̐sam̐ga rādā

(||mĕlu||)
kannula nīgu mŏkkĕm̐ gāṁta vaddam̐gūsuṁḍi
vinnabālu sesugŏni vem̐ḍugŏnĕnu
sannalane movisūbĕ sanavu segŏni yiṁka
manniṁchi lonigeṁgi māḍalāḍarādā

(||mĕlu||)
vāḍigadom̐ jĕkkunŏkki valabu nīgĕrim̐giṁchĕ
vīḍĕmu sedigichchi vem̐ḍugŏnĕnu
jŏḍagusannula nŏttĕ sŏkkusum̐ dĕravesuga
yīḍanainā sevalu seyiṁchugŏrādā

(||mĕlu||)
kŏluvulu nīgu jesĕ kūrimim̐ briyālu sĕppĕ
vĕlayam̐gam̐ gām̐giliṁchĕ vem̐ḍugŏnĕnu
pilisi iṁdām̐kā nīdom̐ bĕnam̐gĕ śhrīveṁkaḍe
talubumūsuga radim̐ daniyiṁcharādā