మెలుఁత ధైర్యమునకు మెచ్చవద్దా
(॥పల్లవి॥)
మెలుఁత ధైర్యమునకు మెచ్చవద్దా
తొలుత నీవన్నిటాను దొడ్డవాఁడ వౌదువు
(॥మెలు॥)
తరుణికి నీమీఁది తలపు గద్దుగనక
విరహమైన మేలే వెతలేదు
మరిగి నీమీఁది ప్రేమ మనసు నిండెఁగనక
సరుగం జిత్తజునకు వెరవ దెంతైనను
(॥మెలు॥)
అంగన ప్రాణములు నీయాన నున్నవిగనక
వెంగలినిట్టూర్పులకు వేసరదు
వుంగరము నీది వేలనుండఁగా జూచీఁ గనక
కుంగదు తమక మెంత కొచ్చియెచ్చరించినా
(॥మెలు॥)
చెలఁగి పాయము నీకు సెలవుసేసెంగనక
తలకొన్నచింతలకు తలఁకదు
చెలి యలమేలుమంగ శ్రీవేంకటేశుఁడవు నీ-
వలరి కూడితి విఁక నందుకు జడియదు
(||pallavi||)
mĕlum̐ta dhairyamunagu mĕchchavaddā
tŏluda nīvanniḍānu dŏḍḍavām̐ḍa vauduvu
(||mĕlu||)
taruṇigi nīmīm̐di talabu gadduganaga
virahamaina mele vĕdaledu
marigi nīmīm̐di prema manasu niṁḍĕm̐ganaga
sarugaṁ jittajunagu vĕrava dĕṁtainanu
(||mĕlu||)
aṁgana prāṇamulu nīyāna nunnaviganaga
vĕṁgaliniṭṭūrbulagu vesaradu
vuṁgaramu nīdi velanuṁḍam̐gā jūsīm̐ ganaga
kuṁgadu tamaga mĕṁta kŏchchiyĕchchariṁchinā
(||mĕlu||)
sĕlam̐gi pāyamu nīgu sĕlavusesĕṁganaga
talagŏnnasiṁtalagu talam̐kadu
sĕli yalamelumaṁga śhrīveṁkaḍeśhum̐ḍavu nī-
valari kūḍidi vim̐ka naṁdugu jaḍiyadu