Melumelu yinnidaanu memtivaidivi

మేలుమేలు యిన్నిటాను మేఁటివైతివి
Language

(॥పల్లవి॥)
మేలుమేలు యిన్నిటాను మేఁటివైతివి
నీ లాగులు వొగడఁగా నేఁడు మాకు వశములా

(॥మేలు॥)
సేస లెందాఁకాఁ బెట్టిన చేతులు కండే పట్టవు
వేసరక వలతువు వెలఁదులకు
ఆల బయలీఁదినా నలయదు నీమనసు
రాసికెక్క నీమేను రాయిగాఁబోలును

(॥మేలు॥)
కడుమాఁట లెన్నాడినా కాయగాయదు నీనోరు
వుడివోక చూతువు వువిదలను
నడుమ నీసెలవులు నవ్వులకు జడియవు
కడలేని నీరూపు కంచు గాఁబోలును

(॥మేలు॥)
చన్ను లెంతవొరసినా సమయదు నీవురము
యెన్నరాక కూడదువు యింతులను
చెన్నుగ శ్రీవేంకటేశ చిగిరించీ నన్నుఁ గూడి
వెన్నుఁడ నీమూర్తి కల్పవృక్షము గాఁబోలును

(||pallavi||)
melumelu yinniḍānu mem̐ṭivaidivi
nī lāgulu vŏgaḍam̐gā nem̐ḍu māgu vaśhamulā

(||melu||)
sesa lĕṁdām̐kām̐ bĕṭṭina sedulu kaṁḍe paṭṭavu
vesaraga valaduvu vĕlam̐dulagu
āla bayalīm̐dinā nalayadu nīmanasu
rāsigĕkka nīmenu rāyigām̐bolunu

(||melu||)
kaḍumām̐ṭa lĕnnāḍinā kāyagāyadu nīnoru
vuḍivoga sūduvu vuvidalanu
naḍuma nīsĕlavulu navvulagu jaḍiyavu
kaḍaleni nīrūbu kaṁchu gām̐bolunu

(||melu||)
sannu lĕṁtavŏrasinā samayadu nīvuramu
yĕnnarāga kūḍaduvu yiṁtulanu
sĕnnuga śhrīveṁkaḍeśha sigiriṁchī nannum̐ gūḍi
vĕnnum̐ḍa nīmūrdi kalbavṛkṣhamu gām̐bolunu