Melumelu saamu seya memtijaana voduvu

మేలుమేలు సాము సేయ మేఁటిజాణ వొదువు
Language

(॥పల్లవి॥)
మేలుమేలు సాము సేయ మేఁటిజాణ వొదువు
చేలకొంగున నాపెకు చెమట దుడిచేవు

(॥మేలు॥)
అంగనగట్టిచన్నులు అడియాలమైనట్టి-
సంగడాలంటా నీవు సారె నెత్తేవు
అంగవించి యప్పటిని ఆపెకాఁగిలే నీకు
చెంగటిగరిడీయంటా చేరి పాయ విపుడు

(॥మేలు॥)
కాంతమేనఁబూసినకస్తూరిబేఁటులు రాలి
సంతత మెఱ్ఱమన్నంటాఁ జల్లుకొనేవు
పంతముతో నీవాపంబంగారువంటిమేను
వింతలుగా కంబము గావించుక పెనఁగేవు

(॥మేలు॥)
అలమేలుమంగరతు లట్టె విన్నాణాలంటా
తలఁచి శ్రీవేంకటేశ తమకించేవు
చెలరేఁగి యాపెమోవి చెఱకుఁబిచ్చెయంటాను
చలువగా వేడుకతోఁ జవిగోనేవు

(||pallavi||)
melumelu sāmu seya mem̐ṭijāṇa vŏduvu
selagŏṁguna nābĕgu sĕmaḍa duḍisevu

(||melu||)
aṁganagaṭṭisannulu aḍiyālamainaṭṭi-
saṁgaḍālaṁṭā nīvu sārĕ nĕttevu
aṁgaviṁchi yappaḍini ābĕgām̐gile nīgu
sĕṁgaḍigariḍīyaṁṭā seri pāya vibuḍu

(||melu||)
kāṁtamenam̐būsinagastūribem̐ṭulu rāli
saṁtada mĕṭramannaṁṭām̐ jallugŏnevu
paṁtamudo nīvābaṁbaṁgāruvaṁṭimenu
viṁtalugā kaṁbamu gāviṁchuga pĕnam̐gevu

(||melu||)
alamelumaṁgaradu laṭṭĕ vinnāṇālaṁṭā
talam̐si śhrīveṁkaḍeśha tamagiṁchevu
sĕlarem̐gi yābĕmovi sĕṟagum̐bichchĕyaṁṭānu
saluvagā veḍugadom̐ javigonevu