Melumelu neenerubu mechchiri savadulellaa

మేలుమేలు నీనేరుపు మెచ్చిరి సవతులెల్లా
Language

(॥పల్లవి॥)
మేలుమేలు నీనేరుపు మెచ్చిరి సవతులెల్లా
తాలిమితో ననుఁ జూడు దక్కఁగొనే నతని

(॥మేలు॥)
చిత్తము రా సేవసేసి సిగ్గు విడిపించితివి
బత్తితోడ నీయొద్దఁ బాయనియ్యవు
గుత్తపుగుబ్బ లురాన గుఱుతులు మోపితివి
యిత్తల నాతని నింకా నెంత వలపింతువో

(॥మేలు॥)
కోరినీమొగము చూచుకొంటా నుండఁ జేసితివి
నేరఁగలపనులెల్లా నేరిపితివి
అరగింపు లెప్పుడు నీయందే మరిపితివి
భీరాన నింకా నెంత ప్రియములు రేఁతువో

(॥మేలు॥)
కొప్పు దువ్వేనంటానే గోరఁ జెక్కు మోపితివి
వొప్పుగఁ గూడీ చెమట లూరించితివి
అప్పుడే శ్రీవేంకటేశు నలమేల్‌మంగవు నీవు
అప్పన మింకా నెంత ఆసలఁబెట్టుదువో

(||pallavi||)
melumelu nīnerubu mĕchchiri savadulĕllā
tālimido nanum̐ jūḍu dakkam̐gŏne nadani

(||melu||)
sittamu rā sevasesi siggu viḍibiṁchidivi
battidoḍa nīyŏddam̐ bāyaniyyavu
guttabugubba lurāna guṟudulu mobidivi
yittala nādani niṁkā nĕṁta valabiṁtuvo

(||melu||)
korinīmŏgamu sūsugŏṁṭā nuṁḍam̐ jesidivi
neram̐galabanulĕllā neribidivi
aragiṁpu lĕppuḍu nīyaṁde maribidivi
bhīrāna niṁkā nĕṁta priyamulu rem̐tuvo

(||melu||)
kŏppu duvvenaṁṭāne goram̐ jĕkku mobidivi
vŏppugam̐ gūḍī sĕmaḍa lūriṁchidivi
appuḍe śhrīveṁkaḍeśhu nalamel‌maṁgavu nīvu
appana miṁkā nĕṁta āsalam̐bĕṭṭuduvo