Melumelu neegunaalu mechchidimayyaa

మేలుమేలు నీగుణాలు మెచ్చితిమయ్యా
Language

(॥పల్లవి॥)
మేలుమేలు నీగుణాలు మెచ్చితిమయ్యా
యీ లాగుల నీకుఁ జేతులెత్తి మొక్కేమయ్యా

(॥మేలు॥)
మంతనాన మాటలాడి మనసు సోదించవచ్చే-
వింత నే నెఱఁగనా యేమయ్యా
సంతోసాన నవ్వు నవ్వి సమతుసేసుకొనేవు
చెంత నీవేమీ సేసినాఁ జెల్లునయ్యా

(॥మేలు॥)
కొంగువట్టితీసి దండఁ గూచుండఁ బెట్టుకొనేవు
అంగడిఁ బెట్టేవా వలపౌనయ్యా
వుంగరము వేలఁబెట్టి వొద్దికఁ బెండ్లాడేవు
సంగతెల్లాఁ గంటి మిట్టె జాణవౌదువయ్యా

(॥మేలు॥)
మొగము దప్పకచూచి మోవితేనె లానేవు
యెగసక్కీఁడవు నిన్ను నేమనేమయ్యా
జిగి నలమేల్‌మంగను శ్రీవేంకటేశుఁడవు
తగిలి నన్నేలితివి తగుఁదగునయ్యా

(||pallavi||)
melumelu nīguṇālu mĕchchidimayyā
yī lāgula nīgum̐ jedulĕtti mŏkkemayyā

(||melu||)
maṁtanāna māḍalāḍi manasu sodiṁchavachche-
viṁta ne nĕṟam̐ganā yemayyā
saṁtosāna navvu navvi samadusesugŏnevu
sĕṁta nīvemī sesinām̐ jĕllunayyā

(||melu||)
kŏṁguvaṭṭidīsi daṁḍam̐ gūsuṁḍam̐ bĕṭṭugŏnevu
aṁgaḍim̐ bĕṭṭevā valabaunayyā
vuṁgaramu velam̐bĕṭṭi vŏddigam̐ bĕṁḍlāḍevu
saṁgadĕllām̐ gaṁṭi miṭṭĕ jāṇavauduvayyā

(||melu||)
mŏgamu dappagasūsi movidenĕ lānevu
yĕgasakkīm̐ḍavu ninnu nemanemayyā
jigi nalamel‌maṁganu śhrīveṁkaḍeśhum̐ḍavu
tagili nannelidivi tagum̐dagunayyā