మేలుమేలు నీగుణాలు మెచ్చితిమయ్యా
(॥పల్లవి॥)
మేలుమేలు నీగుణాలు మెచ్చితిమయ్యా
మైలలేక నీమనసు మణుఁగాయఁగా
(॥మేలు॥)
మచ్చికతో నాపె నీకు మనవులు చెప్పినవి
యిచ్చగించి వింటివిగా ఇన్నియును
వచ్చి నీయెదుటఁ దలవంచుక వున్నందుకు
తచ్చివేసినట్టు నీకు దయవుట్టెఁగా
(॥మేలు॥)
ఆసతోడ నాపె నీకు నంపిన కానికెలవి
సేసవెట్టినచేతులఁ జేకొంటివి
పూసగుచ్చినట్టు నిన్నుఁ బొంచి చూచినయందుకు
రాసినతమకము బోరన రేఁగెఁగా
(॥మేలు॥)
సిగ్గుతోడ నీకునిట్టె సేవలు సేసినవి
అగ్గమై మెచ్చి కాఁగిట నలమితివి
నిగ్గుల శ్రీవేంకటేశ నేఁడు మమ్మునేలితివి
యెగ్గులేని రతులెల్ల నిరవాయఁగా
(||pallavi||)
melumelu nīguṇālu mĕchchidimayyā
mailalega nīmanasu maṇum̐gāyam̐gā
(||melu||)
machchigado nābĕ nīgu manavulu sĕppinavi
yichchagiṁchi viṁṭivigā inniyunu
vachchi nīyĕduḍam̐ dalavaṁchuga vunnaṁdugu
tachchivesinaṭṭu nīgu dayavuṭṭĕm̐gā
(||melu||)
āsadoḍa nābĕ nīgu naṁpina kānigĕlavi
sesavĕṭṭinasedulam̐ jegŏṁṭivi
pūsaguchchinaṭṭu ninnum̐ bŏṁchi sūsinayaṁdugu
rāsinadamagamu borana rem̐gĕm̐gā
(||melu||)
siggudoḍa nīguniṭṭĕ sevalu sesinavi
aggamai mĕchchi kām̐giḍa nalamidivi
niggula śhrīveṁkaḍeśha nem̐ḍu mammunelidivi
yĕgguleni radulĕlla niravāyam̐gā