Melumelu nee bhaagyamu merase nimdarilona

మేలుమేలు నీ భాగ్యము మెరసె నిందరిలోన
Language

(॥పల్లవి॥)
మేలుమేలు నీ భాగ్యము మెరసె నిందరిలోన
యీలీల నెందరినైనా నేలవయ్యా నీవు

(॥మేలు॥)
జక్కవచన్నులుయాపె సన్నపునడిమియాపె
చుక్కబొట్టుతో నిన్నుఁజూచేయాపె
వెక్కనపు ముంగరాపె వింతసింగారాలయాపె
యెక్కడఁ గలిగె నీకు నింతటివొయ్యారి

(॥మేలు॥)
గొప్పకన్నులాపె కొమరెపాయపుటాపె
కప్పురపునోరఁ జెప్పె కత నీ కాపె
కొప్పునిక్కఁబెట్టినాపె గుడిగొన్నసొమ్ములాపె
యెప్పుడు నిన్నుఁ బెండ్లాడె ఇంకచేఁతలాఁడి

(॥మేలు॥)
చిన్నిపెదవులయాపె చెలువపుఁజెక్కులాపె
చెన్నగుచేతుల సేవసేసీ నీ కాపె
ఇన్నిటా శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఎడు
యెన్నఁడు నీపొందుసేసె నీ ముద్దులకలికి

(||pallavi||)
melumelu nī bhāgyamu mĕrasĕ niṁdarilona
yīlīla nĕṁdarinainā nelavayyā nīvu

(||melu||)
jakkavasannuluyābĕ sannabunaḍimiyābĕ
sukkabŏṭṭudo ninnum̐jūseyābĕ
vĕkkanabu muṁgarābĕ viṁtasiṁgārālayābĕ
yĕkkaḍam̐ galigĕ nīgu niṁtaḍivŏyyāri

(||melu||)
gŏppagannulābĕ kŏmarĕbāyabuḍābĕ
kappurabunoram̐ jĕppĕ kada nī kābĕ
kŏppunikkam̐bĕṭṭinābĕ guḍigŏnnasŏmmulābĕ
yĕppuḍu ninnum̐ bĕṁḍlāḍĕ iṁkasem̐talām̐ḍi

(||melu||)
sinnibĕdavulayābĕ sĕluvabum̐jĕkkulābĕ
sĕnnagusedula sevasesī nī kābĕ
inniḍā śhrīveṁkaḍeśha yelidivi nannu neĕḍu
yĕnnam̐ḍu nībŏṁdusesĕ nī muddulagaligi