Melumelu meegunaalu mechcha ketlumdavachchu

మేలుమేలు మీగుణాలు మెచ్చ కెట్లుండవచ్చు
Language

(॥పల్లవి॥)
మేలుమేలు మీగుణాలు మెచ్చ కెట్లుండవచ్చు
వొలవేసి గుట్టుతోడ నున్నారమయ్యా

(॥మేలు॥)
చెప్పఁబొప్పఁ గొత్తలాయ సేసినవే చేఁతలాయ
కప్పురగందికి నీకుఁ గాఁపురములు
చొప్పులెత్తిపెట్టరాదు సుద్దు లడుగఁగరాదు
వొప్పుగొని గుట్టుతోడ నున్నారమయ్యా

(॥మేలు॥)
చూడఁజూడ సోద్యాలాయ చుట్టరికము గట్టేయ
జాడతో మీయిద్దరికి సరసములు
వేడుకకు వెలలేదు విచ్చిచెప్ప వేళగాదు
వొడకిట్టె గుట్టుతోడ నున్నారమయ్యా

(॥మేలు॥)
పుట్టఁబుట్ట వింతలాయ పొద్దు కొక్కచాయలాయ
ఇట్టె శ్రీవేంకటేశ మీఇంపురతులు
నెట్ట న నన్నేలితివి నీకు నాకు నిఁకఁ బోదు
వొట్టుకొని గుట్టుతోడ నున్నారమయ్యా

(||pallavi||)
melumelu mīguṇālu mĕchcha kĕṭluṁḍavachchu
vŏlavesi guṭṭudoḍa nunnāramayyā

(||melu||)
sĕppam̐bŏppam̐ gŏttalāya sesinave sem̐talāya
kappuragaṁdigi nīgum̐ gām̐puramulu
sŏppulĕttibĕṭṭarādu suddu laḍugam̐garādu
vŏppugŏni guṭṭudoḍa nunnāramayyā

(||melu||)
sūḍam̐jūḍa sodyālāya suṭṭarigamu gaṭṭeya
jāḍado mīyiddarigi sarasamulu
veḍugagu vĕlaledu vichchisĕppa veḽagādu
vŏḍagiṭṭĕ guṭṭudoḍa nunnāramayyā

(||melu||)
puṭṭam̐buṭṭa viṁtalāya pŏddu kŏkkasāyalāya
iṭṭĕ śhrīveṁkaḍeśha mīiṁpuradulu
nĕṭṭa na nannelidivi nīgu nāgu nim̐kam̐ bodu
vŏṭṭugŏni guṭṭudoḍa nunnāramayyā