Melumelu jaanavaudu mestiraa ninnu

మేలుమేలు జాణవౌదు మెస్తిరా నిన్ను
Language

(॥పల్లవి॥)
మేలుమేలు జాణవౌదు మెస్తిరా నిన్ను
పోలికెకు నవ్వితేనే బూమెలు సేసేవా

(॥మేలు॥)
చేరలంతలు కన్నులఁ జిమ్మి తిట్టే విట్లైతే
మారుకుమారు దిట్టేఁబో మానరా నీవూ
కోరేటిదేవుఁడవైతే గుడిలోనే వుందుగాక
చేరి మొక్కినట్టివారిఁ జెఱఁగు వట్టేవా

(॥మేలు॥)
సన్నసేసి బొమ్మలనే జంకించే విట్లైతే
నిన్నుఁ గమ్మర జంకించే నిలరా నీవు
వున్నతపుదొరవైతే వూళ్లేలుదువుగాక
వన్నెలవిడె మిచ్చితే వావి చూచేవా

(॥మేలు॥)
సంగడిఁ జేయిముట్టి సరసములాడే విట్లైతే
పంగించి నే నట్టేసేసేఁ బదరా నీవు
రంగుగ శ్రీ వేంకటేశ రాజువలె నుందుగాక
వుంగిటి నిన్నుఁ గూడితే వురమెక్కించేవా

(||pallavi||)
melumelu jāṇavaudu mĕstirā ninnu
poligĕgu navvidene būmĕlu sesevā

(||melu||)
seralaṁtalu kannulam̐ jimmi tiṭṭe viṭlaide
mārugumāru diṭṭem̐bo mānarā nīvū
koreḍidevum̐ḍavaide guḍilone vuṁdugāga
seri mŏkkinaṭṭivārim̐ jĕṟam̐gu vaṭṭevā

(||melu||)
sannasesi bŏmmalane jaṁkiṁche viṭlaide
ninnum̐ gammara jaṁkiṁche nilarā nīvu
vunnadabudŏravaide vūḽleluduvugāga
vannĕlaviḍĕ michchide vāvi sūsevā

(||melu||)
saṁgaḍim̐ jeyimuṭṭi sarasamulāḍe viṭlaide
paṁgiṁchi ne naṭṭesesem̐ badarā nīvu
raṁguga śhrī veṁkaḍeśha rājuvalĕ nuṁdugāga
vuṁgiḍi ninnum̐ gūḍide vuramĕkkiṁchevā