Melumelu jaanavaudu mestiraa ninnu

మేలుమేలు జాణవౌదు మెస్తిరా నిన్ను
Language

(॥పల్లవి॥)
మేలుమేలు జాణవౌదు మెస్తిరా నిన్ను
నాలికాఁడవై నన్ను నవ్వు నవ్వించితివి

(॥మేలు॥)
ఘనుఁడ నినుఁ గనులఁ గన్నప్పటనుండి నాకు
వెనక నేరములెంచ వెరపయ్యీని
మొనసి నీకిదియేమి మొగసిరిమందు గద్దో
వనితలు నన్ను నవ్వ వాకట్టు గట్టితివి

(॥మేలు॥)
బత్తితో నీవినయాలాపస విన్నప్పటనుండి
చిత్తము చెదరనాడ సిబ్బితయ్యీని
చిత్తజుఁడు నీకిఁక చేతికి వసమైనాఁడో
వత్తివలె వాడించి వలపు రేఁచితివి

(॥మేలు॥)
కాఁగిటికి నీవు నన్నుఁ గదిసినప్పటనుండి
వేఁననాడఁ గొలుపదు వేడుకయ్యీని
చేఁగదేరఁ గూడితివి శ్రీవేంకటేశ్వర నన్ను
మూఁగిన మూఁకలో నీకు మొక్కఁగఁ జేసితివి

(||pallavi||)
melumelu jāṇavaudu mĕstirā ninnu
nāligām̐ḍavai nannu navvu navviṁchidivi

(||melu||)
ghanum̐ḍa ninum̐ ganulam̐ gannappaḍanuṁḍi nāgu
vĕnaga neramulĕṁcha vĕrabayyīni
mŏnasi nīgidiyemi mŏgasirimaṁdu gaddo
vanidalu nannu navva vāgaṭṭu gaṭṭidivi

(||melu||)
battido nīvinayālābasa vinnappaḍanuṁḍi
sittamu sĕdaranāḍa sibbidayyīni
sittajum̐ḍu nīgim̐ka sedigi vasamainām̐ḍo
vattivalĕ vāḍiṁchi valabu rem̐sidivi

(||melu||)
kām̐giḍigi nīvu nannum̐ gadisinappaḍanuṁḍi
vem̐nanāḍam̐ gŏlubadu veḍugayyīni
sem̐gaderam̐ gūḍidivi śhrīveṁkaḍeśhvara nannu
mūm̐gina mūm̐kalo nīgu mŏkkam̐gam̐ jesidivi