మేలుమేలు ఇన్నిటాను మించితివిగా
(॥పల్లవి॥)
మేలుమేలు ఇన్నిటాను మించితివిగా
యీలాగువాఁడవౌత యెఱఁగము నేము
(॥మేలు ॥)
నవ్వు నవ్వకంత నీవు నాతో సారెకు నేఁడు
నవ్వినట్టె వున్నది నీనామముజాడ
జవ్వనపుబొమ్మలనే జంకించే విందుకుగా
యెవ్వతె నేరిపె నీకు నింతలేసివెల్లను
(॥మేలు॥)
నిక్కిచూడ కంత నీవు నిలిచి కమ్మర నన్ను
నిక్కినట్టె వున్నది నీనిట్టతురుము
చక్కనై నీ కిదియునుఁ జందమాయ నెందరికి
మొక్కినాను వీడకుండు మోసలేదు నీకు
(॥మేలు॥)
చెక్కునొక్క కంత నీవు చేరి నన్నుఁగూడుమని
చెక్కునొక్కినట్టె నీసేసలముద్దు
మిక్కిలి శ్రీవేంకటేశ మెరయుజాణవు నీవు
నిక్కము నీకాఁగిటిలో నేరుపుమీ నాకు
(||pallavi||)
melumelu inniḍānu miṁchidivigā
yīlāguvām̐ḍavauda yĕṟam̐gamu nemu
(||melu ||)
navvu navvagaṁta nīvu nādo sārĕgu nem̐ḍu
navvinaṭṭĕ vunnadi nīnāmamujāḍa
javvanabubŏmmalane jaṁkiṁche viṁdugugā
yĕvvadĕ neribĕ nīgu niṁtalesivĕllanu
(||melu||)
nikkisūḍa kaṁta nīvu nilisi kammara nannu
nikkinaṭṭĕ vunnadi nīniṭṭadurumu
sakkanai nī kidiyunum̐ jaṁdamāya nĕṁdarigi
mŏkkinānu vīḍaguṁḍu mosaledu nīgu
(||melu||)
sĕkkunŏkka kaṁta nīvu seri nannum̐gūḍumani
sĕkkunŏkkinaṭṭĕ nīsesalamuddu
mikkili śhrīveṁkaḍeśha mĕrayujāṇavu nīvu
nikkamu nīgām̐giḍilo nerubumī nāgu